బాబును కుళ్లబొడుస్తున్న వర్మ.. ఈ పాట చూశారా..?

Spread the love

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ మారింది. కానీ.. సెన్సేషన్ మాత్రం టీజర్ టీజర్ కూ.. సాంగ్ సాంగ్ కూ పెరిగిపోతోంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ మార్చిన రామ్ గోపాల్ వర్మ… ఈ మూవీలోని మరో పాటను విడుదల చేశాడు. చంపేస్తాడు… బాబూ చంపేస్తాడు.. అంటూ సాగే పాట.. దాన్ని చిత్రీకరించిన విధానం… అందులోని సాహిత్యం… తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

చంపేస్తాడు.. పాట మొదటినుంచి చివరివరకూ ఆసక్తి రేపేదే. మొదటిసారి లోకేశ్ పాత్రధారి, వెలుగుదేశం పార్టీ నాయకుడితో డైలాగులు వినిపించారు. ఆయన టంగ్ స్లిప్పులను కూడా వీడియోలో చూపించాడు వర్మ. డబ్బింగ్ కూడా బాగా సూటయ్యింది. ఇదో రాజకీయ కల్పిత సినిమానే అయినా.. అందులో పాత్రలు నిజజీవిత పాత్రలను పోలి ఉండటంతో.. జనం అందరూ వాళ్లే అనుకోవడం కామన్.

ఇక పాట రచన కూడా అంతే. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు డేంజరస్ గా ఉంటాయని అందులో చూపించారు. లోకేశ్ క్యారెక్టర్… మా నాన్న సంగతి వాళ్లకింకా తెలియదు అనగానే… “మనిషి చెంపమీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్యతంతే నిలదొక్కుకోగలడు.. కానీ… అహం మీద కొడితే.. చంపేస్తాడు.. ” అంటూ పాట సాగుతుంది.

“వయసులోన చిన్నవాడు వెక్కిరిస్తుంటే.. ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ధిక్కరిస్తుంటే.. ఊహలోనే లేని మంట మండిస్తుంటే.. పేరు మీదపెంట ఏదో పారేస్తుంటే.. వెయిట్ చేస్తాడు.. స్కెచ్చు గీస్తాడు.. వెన్నుపోటు టైమ్ కోసం వేచి ఉంటాడు.. కొయ్యతీసే రోజు కోసం పూజ చేస్తాడు. చంపేస్తాడు.. ” ఇలా సాగుతుంది ఆ పాట.

“ఉప్పెనల్లే ఓటమొచ్చి కొంప ముంచేస్తే.. పరువు తీసి కిందపైన చెమట పట్టిస్తే.. పచ్చనోట్ల ఆశలన్నీ తొక్కిపారేస్తే.. వెంట ఉన్న సొంతవాళ్లు గోడ దూకేస్తే.. ప్లాన్ వేస్తాడు.. స్కీము రాస్తాడు.. నమ్మలేని ఎత్తువేసి స్పాటు పెడతాడు.. శత్రుశేషం నాశనార్థం మ్యాపు గీస్తాడు…” ఇదీ రెండో చరణం.

ఈ పాటవిన్న వాళ్లు.. చంద్రబాబును కుళ్లబొడిచే ఆపరేషన్ ను అపోజిషన్ .. ఎంత సీరియస్ గా తీసుకుందో అనుకుంటున్నారు. సెన్సార్ ప్రాబ్లమ్ ను దాటుకుని ఈ మూవీ థియేటర్ కు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : వాహ్.. వర్మ! ‘కమ్మరాజ్యం..’లో నటుల ఎంపిక హైలైట్

https://youtu.be/t8TazDUEXTQ
(Visited 100 times, 1 visits today)
Author: kekanews