Cockroaches and Ants : ఎండాకాలంలో ఇంట్లో అందరినీ చిరాకుపెట్టేది చీమలే. ఎంత ప్రయత్నించినా చీమలు ఇంట్లోకి ఏదో ఒక మూల నుంచి వచ్చేస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఇలా చేయండి. చీమలే కాదు బొద్దింకలు కూడా పారిపోతాయి.
మీ వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులను అక్కడక్కడ పెట్టండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన.. బొద్దింకలు, చీమలకు పడదు. దీంతో.. ఆ పరిసరాల్లోకి రావడానికి వెనుకాడతాయి. దోసకాయ ముక్కలు చీమల రంధ్రాల దగ్గర ఉంచండి. అప్పుడు అవి బయటకు రానేరావు.
బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలను చీమలు, బొద్దింకలు చేరే మూలల్లో ఉంచండి. ఈ వాసన, ఆ రసం కీటకాలకు పడదు. వైట్ వెనిగర్ ను దోమలు, చీమల గూళ్లలో స్ర్పే చేసినా కూడా కీటకాలు దరిచేరవు.
చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో దాల్చిన చెక్క పొడి చల్లండి. పుదీనా ఆకుల వాసన కూడా ఈగలు, బొద్దింకలు అసహ్యించుకుంటాయి. వంటగదిలోకి చీమలు ప్రవేశించే ప్రదేశాలలో కాఫీ పొడి చల్లినా కూడా ఫలితం ఉంటుంది. చీమలు, బొద్దింకల పాలిట విషం అయిన బోరాక్స్ పౌడర్ లో చక్కెర కలిపి అక్కడక్కడా పెట్టండి. అవి తిన్న బొద్దింకలు, చీమలు అక్కడే మరణిస్తాయి. మిగతావాటిని కూడా సంహరించేందుకు అవకాశం ఉంటుంది.