tamanna-bhatia-kekanews-hd-photos-scaled.jpg

Tamannah : బాడీలో మార్పులపై ట్రోలింగ్స్.. తమన్నా ఏం చెప్పిందంటే?

తమన్నా (Tamannah Bhatia) అంటే టోటల్ టాలీవుడ్ కు సమ్మోహనమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి తమన్నా ఒకరు.



ఈమె గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ల ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ ఈమె సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్వాటలో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఈ పెళ్లి గురించి తమన్నా అటు విజయ్ వర్మ ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.ఇక తమన్నా పెళ్లి గురించి ఆమె వ్యక్తిగత విషయాలు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలపై తమన్న స్పందించి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తమన్నా కాస్త శరీర బరువు పెరగడంతో పలువురు ఆమెపై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా కోవిడ్ కారణంగా తాను కాస్త బరువు పెరగడంతో పలువురు ఆమె పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.

తెలుగులో ఆఫర్స్‌ అంతగా లేకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ప్రస్తుతం తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులో చివరిగా సత్యదేవ్‌ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. రీసెంట్‌గా రజనీకాంత్‌ జైలర్‌లో మూవీలో వా నువ్వు కావాలయ్య.. అంటూ అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో అలరించింది.అయితే చిరుతో నటించిన భోళా శంకర్ ప్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్‌ తగ్గిపోయాయి.

(Visited 1 times, 1 visits today)
Author: kekanews