బిత్తిరి సత్తి ఔట్… చీటీ చింపేసిన టీవీ 9

Spread the love

ఇస్మార్ట్ గా ఫేడవుట్ అయిపోయిన సత్తి

అగ్నికి ఆజ్యం పోసిన ఫాదర్స్ డే ఎపిసోడ్

ఎగ్జిట్ చూపించిన ఇగో

బంగారమనుకున్న బిత్తిరోడు బరువయ్యాడు

భారం దించుకున్న టీవీ9

రిజైన్ చేశాడో… పంపించేశారో.. కానీ… బిత్తిరి సత్తి మాత్రం టీవీ9 నుంచి బయటకొచ్చాడు. ఇక్కడి వరకు క్లారిటీ పక్కాగా ఉంది.. కానీ.. సత్తి ఏం చేశాడని ఇలా జరిగింది… ఏరి కోరి.. ఇష్టపడి మరీ.. టీవీ9 ఛానెల్ లో జాయిన్ అయితే.. ఇలా అర్ధాంతరంగా ఎందుకు బయటకు వచ్చాడన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

2019 నవంబర్. వీ6లో ఓ అలజడి. సత్తి రిజైన్ చేశాడు. అదేంటి.. అదంతే. రిజైన్ చేశాడు. తనకు సంస్థలో రెస్పెక్ట్ తగ్గిందన్న కారణంతో.. ఆయన మరో ప్లాట్ ఫామ్ ఎంచుకున్నాడు. అప్పటికే సావిత్రి బిగ్ బాస్ లో నటించడం కోసం.. వీ6ను వదిలి వెళ్లిపోయింది. బిత్తిరి సత్తి.. కమర్షియల్ గా మంచి ఊపుమీదున్న టైమ్ లో .. ఛానల్ మార్పు తనకు మరింత కలిసొస్తుందని భావించాడు. ఎన్టీవీ, టీవీ9 రెండు ఛానెళ్లతో సంప్రదింపులు జరిపాడని టాక్. దాదాపు నెలకు మూడున్నర లక్షల జీతంతో.. టీవీ9 రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడంతో.. బిత్తిరి సత్తి.. అందులో చేరిపోయాడు.

ఆ తర్వాత టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ ప్రారంభం కావడం… శివజ్యోతి అలియాస్ సావిత్రి ఆ ప్రోగ్రామ్ జత కలవడంతో.. మొదట్లో.. ప్రోగ్రామ్ పై అందరి కళ్లు పడ్డాయి. వీ6 తీన్మార్ ప్రోగ్రామ్ కు కాపీగా వచ్చినప్పటికీ.. కంటెంట్ పరంగా ఇస్మార్ట్ న్యూస్ వెనుకబడింది. సావిత్రి- సత్తి జోడీ మునుపటి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇస్మార్ట్ గా ఫేడవుట్ అయిపోయిన సత్తి

బిత్తిరి సత్తితో డబుల్ రోల్ అంటూ పలు ప్రయోగాలు చేశారు. ఐతే.. అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ స్లాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సూర్య అనే కుర్రాడు ఆకట్టుకున్నాడు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ వాయిస్ ఇమేటేషన్ చాలా కష్టం. కానీ.. అది అతడికి సాధ్యపడింది. కంటెంట్ కన్నా.. అతడు పలికే డైలాగులు చిత్రంగా అనిపించేవి. దీంతో.. జనం సత్తి కన్నా.. దేవరకొండ స్టైల్లో సూర్య చేసే స్కిట్ ను చూసేందుకు ఆసక్తి చూపించారు.

అగ్నికి ఆజ్యం పోసిన ఫాదర్స్ డే ఎపిసోడ్

ఈ విషయం మేనేజ్ మెంట్ కు కూడా అర్థమైంది. లక్షలు పోసి తెచ్చుకున్న బిత్తిరి సత్తి తాము ఊహించినంతగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ… పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేని సూర్య… ప్రోగ్రామ్ కు హైప్ తెచ్చాడు. దీంతో… యాజమాన్యం ఆలోచనలో పడింది. ఛానెల్ లో చేస్తున్నా.. కమర్షియల్స్ చేసుకోవడం.. సొంత యూట్యూబ్ ఛానెల్ నడుపుకోవడం సత్తికి అలవాటు. వీ6 ఛానెల్ లోనూ ఇదే పద్ధతి కొనసాగించాడు. ఐతే.. అక్కడి యాజమాన్యం సత్తికి అడ్డుపడలేదు. కానీ.. టీవీ9 మేనేజ్ మెంట్ తో… కమర్షియల్స్ విషయంలో కొంత కాన్ ఫ్లిక్ట్ మొదలైంది. ఇటీవల ఫాదర్స్ డే రోజు… బిత్తిరి సత్తి చేసిన స్కిట్… మొత్తం వివాదంలో అగ్గిపోసింది.

ఎగ్జిట్ చూపించిన ఇగో

స్కిట్ కోసం తన తండ్రి ఫొటోను బిత్తిరి సత్తి ఉపయోగించాడు. ఇలా ఎందుకు చేశారని మేనేజ్ మెంట్ అడిగింది. దానికి.. సత్తి.. ప్రొడ్యూసర్ చెప్పిన సమాధానంతో యాజమాన్యం శాటిస్ ఫై కాలేదు. ఇటు సంస్థ.. అటు ఇద్దరు ఉద్యోగులు.. సెంటిమెంట్, ఇగోకు వెళ్లడంతో.. వాదులాట పెరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఛానెల్ పెట్టలేదని.. ఇష్టమొచ్చినొట్టుచేసుకుంటానంటే బయట చేసుకోండని సంస్థ సీఈఓ తేల్చిచెప్పారు. దీంతో.. ప్రొడ్యూసర్ హర్ట్ అయి వెళ్లిపోయాడు. ఐతే.. సత్తి-యాజమాన్యం మధ్య కొద్దిసేపు చర్చలు జరిగినా..అవి ఫలితం ఇవ్వలేదు. దీంతో.. సత్తి టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బంగారమనుకున్న బిత్తిరోడు బరువయ్యాడు

భారం దించుకున్న టీవీ9

ఏ సంస్థ అయినా.. లాభాలే పరమావధి. బంగారమని తెచ్చుకున్న బిత్తిరి సత్తి… టీవీ9కు మూడు నెలలకే బరువయ్యాడు. అతడికి ఇచ్చే పేమెంట్ ఆ స్థాయిలో ఉంది. బిత్తిరి సత్తికి ఇచ్చే పేమెంట్ తో.. యాభై వేల జీతగాళ్లు ఏడుగురిని పెట్టుకోవచ్చని చెబుతారు.  కరోనా పరిస్థితుల్లో యాడ్స్ తగ్గిపోయాయి. సంస్థ క్రైసిస్ ఎదుర్కొంది. పెద్ద పెద్ద సంస్థలే ఇబ్బందిపడుతున్న టైమ్ లోనూ.. టీవీ9 తమ ఉద్యోగుల జీతాల్లో కోత మాత్రం పెట్టలేదు. ఐతే.. బిత్తిరి సత్తి బరువును మాత్రం మోయలేకపోయింది. ఈ భారం దించుకునేందుకు ఎదురుచూడని అవకాశం .. ఫాదర్స్ డే వివాదం రూపంలో టీవీ9కు రావడంతో.. దాన్ని ఆచరణలో పెట్టిందని సమాచారం.

(Visited 2,584 times, 1 visits today)
Author: kekanews