Sperm in Ice Cream : ఓ Viral Video గలీజ్ గాడిని కటకటాలపాలుచేసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండంలో ఓ వ్యాపారి మూత్రం, వీర్యం కలిపి ఐస్‌క్రీం విక్రయిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపింది. విక్రయదారుడు హస్తప్రయోగం చేస్తూ తన వీర్యాన్ని ఐస్‌క్రీమ్‌లో కలుపుతున్నట్లు మార్చి 19, మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. కల్తీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి విక్రయించినందుకు గాను విక్రేతను నెక్కొండ పోలీసులు అరెస్టు చేశారు.
నెక్కొండలో అసభ్యంగా ప్రవర్తించిన రాజస్థాన్ వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్కొండ మండలం రాజస్థాన్‌కు చెందిన కలురామ్ కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్‌లో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు శాంపిల్ తీసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు కాలురామ్ కుర్బియాపై చట్టబద్ధంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సెక్షన్ 294 ఐపిసి, కేసు నంబర్ 48/2024 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నెక్కొండ గ్రామంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గర బండిలో ‘ఐస్‌క్రీమ్‌లు’, ‘కుల్ఫీ’ అమ్ముతున్నాడు. ఐస్‌క్రీం బండి వద్ద హస్తప్రయోగం చేయడం చూసిన ధర్మేంద్ర జాత్ చౌదరి వీడియో తీశాడు. ‘నెక్కొండ పీపుల్స్’ వాట్స్ యాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అలా సంఘటన బయటపడి వ్యాపారి అరెస్టయ్యాడు. శుభ్రత పాటించకపోతే తాట తీస్తామని వీధి విక్రయదారులను పోలీసులు హెచ్చరించారు.