కోహ్లీ ఊచకోత… ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ ఎన్ కౌంటర్

Spread the love

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు … విరాట్ కోహ్లీ పరుగుల ఊచకోతలో ఎన్ కౌంటర్ అయింది. భారీ స్కోరు సాధించి.. గెలుపుపై ధీమాతో ఉన్న వెస్టిండీస్ ఆశలను… విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ తో చెల్లాచెదురు చేశాడు. కళ్లుచెదిరే ఇన్నింగ్స్ తో.. ఇండియాకు ఒంటిచేత్తో విక్టరీ అందించాడు.

టాస్ గెలిచిన ఇండియా.. వెస్టిండీస్ కు బ్యాటింగ్ ఇచ్చింది. టీట్వంటీ మ్యాచ్ లలో ఎంత తోపులో మరోసారి ఈ మ్యాచ్ తో నిరూపించారు కరీబియన్లు. వచ్చినోళ్లు వచ్చినట్టుగా బాదడంతో… వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. ఓపెనర్ లెవిస్ 40, బ్రెండన్ కింగ్ 31, హెట్ మెయిర్ 56, పోలార్డ్ 37, హోల్డర్ 24 రన్స్ చేశారు.

హాఫ్ సెంచరీతో ఆదుకున్న కేఎల్ రాహుల్

ఓవర్ కు పది పరుగులపైనే రన్ రేట్ తో… 208 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా… రోహిత్ శర్మ(8) ఔట్ తో షాకయ్యింది ఐతే… మరో వికెట్ పడకుండా.. విరాట్ కోహ్లీ అండతో.. కేఎల్ రాహుల్(40బాల్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62రన్స్) ఇండియా పోరాటంలో నిలిపాడు. రెండో వికెట్ కు కోహ్లీతో కలిసి 100 రన్స్ పార్ట్ నర్ షిప్ అందించాడు. తర్వాత రిషభ్ పంత్(18) కూడా కొద్దిసేపు విలువైన రన్స్ చేశాడు.

కోహ్లీ చేసిన అద్భుతం

ఐతే.. మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమే చేశాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను రెండు రకాలుగా చూస్తే.. అతడు గేర్ ఎలా మార్చాడో అర్థంచేసుకోవచ్చు. మొదటి 32 బాల్స్ లో 40 రన్స్ మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ…. ఆ తర్వాత… 18 బాల్స్ లోనే 52 రన్స్ కొట్టి ఇడియాకు రికార్డ్ విక్టరీ అందించాడు..  

ఓ దశలో ఇండియా 32 బాల్స్ 67 రన్స్ చేయాల్సిన స్థితిలో అన్నీ తానై శివమెత్తి బౌండరీలు బాదాడు విరాట్ కోహ్లీ. గెలుపు కోసం కోహ్లీ మాస్టర్ క్లాస్ ఆటతీరు చూపించాడు. విజయాన్ని వెస్టిండీస్ కళ్లముందునుంచే ఆ జట్టు ప్లేయర్లే ఊహించని రీతిలో లాగేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లు కవ్వించడంతో.. కసితో రగిలిపోయాడు విరాట్ కోహ్లీ.  విలియమ్స్ వేసిన 12 బాల్స్ లోనే 34 రన్స్ పిండుకున్నాడు.

సిక్సర్ తో 50.. సిక్సర్ తో విన్నింగ్ షాట్

ఓవరాల్ గా.. 50 బాల్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 94 రన్స్  చేసిన విరాట్ కోహ్లీ… 18.4 ఓవర్లలోనే ఇండియాను గెలిపించాడు. సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ… సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు.

చేజింగ్ లో ఇండియా రికార్డ్

ఇది  ఇండియాకు రికార్డ్ గెలుపు. టీ20లో 207 రన్స్ ను బీట్ చేయడం ఇండియా హయ్యెస్ట్ చేజింగ్ రికార్డ్. చేజింగ్ లో మొనగాడి ఆట ఆడే కోహ్లీ.. ఇండియాకు అద్భుత విజయం అందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెల్చుకున్నాడు. 3 టీట్వంటీ ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Read Also : #Disha నిందితుల ఖేల్ ఖతం.. ఫొటో స్టోరీ

(Visited 92 times, 1 visits today)
Author: kekanews