శ్రీలంక, నేపాల్, మయన్మార్ లను #CAAలో ఎందుకు చేర్చలేదు..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

శ్రీలంక, నేపాల్, మయన్మార్ సెక్యులర్ స్టేట్స్. ఈ దేశాలకు రిలీజియన్ లేదు. ఆ దేశాల రాజ్యాంగం ప్రకారం అన్ని రిలీజియన్స్ ఈక్వల్ గానే చూడాలి. అలాంటప్పుడు అక్కడినుంచి వలస వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది. Religion  పేరు మీద Persecution(హింస) జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న దేశాల్లోని బాధితుల పక్షాన CAB నిలబడుతోంది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ తాము మతతత్వ దేశాలు అన్నాయి కాబట్టి.. పౌరసత్వ సవరణ బిల్లు ఆ దేశాలను పరిగణలోకి తీసుకోవడంలేదు. ఒకవేళ ఆ దేశాలు సెక్యులర్ అయి ఉంటే.. ఇండియాకు ఈ బిల్లు తెచ్చే అవసరమే ఉండకపోయేది. అక్కడ మైనారిటీలు ప్రాణభయంతో ఉన్నారు కాబట్టే ఇండియాలోకి ఆహ్వానిస్తున్నామని అమిత్ షా చెప్పారు. సిరియాలో దాడులు జరిగినప్పుడు.. యూరప్ కు వలస వెళ్లారు. ముస్లింస్ కే షెల్టర్ ఇస్తున్నారెందుకు అని ప్రశ్నించడం తప్పే అవుతుంది. ఎక్కడైనా ప్రాణభయంతో ఉన్నవారికే శరణం లభిస్తుంది.

ఈ దేశం మైనారిటీలనే కాదు.. పక్కదేశం మైనారిటీలను మానవీయ కోణంలో రాణిస్తుంటే ప్రతిపక్షాలకు కలిగే బాధేంటో అర్థం కావడం లేదనేది కేంద్రం వాదన. ఇండియాకు ఓ హిందువుతో సెక్యూరిటీ త్రెట్ ఉందనిపించినా.. అతన్ని చట్టం రానీయదు.

శ్రీలంక విషయంలో CAB ఏం చెబుతోంది…?

శ్రీలంకలో వార్ జరుగుతున్నప్పుడు అది తట్టుకోలేక ఇండియాకు కొందరు శరణార్థులుగా వచ్చారు. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి శ్రీలంక వెళ్లిపోయారు. వచ్చేవాళ్లే ఇపుడు లేరని కేంద్రం అంటోంది. మత, భాషాపరమైన హింస ఇప్పుడు జరగడం లేనప్పుడు.. వారికి వర్తింపచేసి వేస్ట్.

(Visited 112 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *