హైదరాబాద్ సహా ఇండియాలో ఉన్న రోహింగ్యాల పరిస్థితి ఏంటి..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది అస్సాంకు అప్లై అయింది. ఇపుడు ఇండియా మొత్తానికి అప్లై చేస్తామని అమిత్ షా చెప్పారు. పూర్వీకులు , సంబంధితులు ఎవరూ కూడా 1950 నుంచి ఇండియాలో లేకపోతే వాళ్లను కూడా వెనక్కి  పంపించేస్తారు.

#CAB విషయంలో ఆర్టికల్ 14 ఏం చెబుతోంది..?

ఆర్టికల్ 14 అనేది.. ఇండియాలో చట్టం కళ్ల ముందు అందరూ సమానమే అని చెబుతోంది. అందరినీ సమంగా ట్రీట్ చేయాలని చెబుతోంది. కాకపోతే… వీలుకాని చోట.. రీజనబుల్ గా క్లాసిఫై చేయాలని కూడా చెబుతోంది. ఈ వెసులుబాటు నుంచే రిజర్వేషన్లు  వచ్చాయి.

ప్రాణభయం ఉన్నవాళ్లందరూ ఇండియాలోకి వచ్చేయండి అన్నప్పుడు.. మొత్తం పాకిస్థాన్, మొత్తం బంగ్లాదేశ్ ప్రజలంతా ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ… నిజంగా అలా వచ్చేవాళ్లందరికీ ప్రాణభయం లేదు. అవి ముస్లిం కంట్రీస్ కాబట్టి.. ఇస్లాంను పాటించని వాళ్లకు మాత్రమే అక్కడ ప్రాణభయం ఉంది. అందుకే ఇస్లామేతరులను మాత్రమే చట్టం రమ్మని చెబుతోంది.

(Visited 78 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *