ఢిల్లీనుంచి రాగానే ఆర్టీసీ కార్మికులకు CM డెడ్ లైన్

మాటల్లేవ్.. చర్చల్లేవ్..

డ్యూటీకి రావాల్సిందే..

రాకపోతే.. ఉద్యోగం నుంచి పీకి పడేస్తాం

కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

CM కేసీఆర్ మరోసారి ఉగ్ర అవతారం ఎత్తారు. ఢిల్లీలో టూర్ ముగించుకుని హైదరాబాద్ రాగానే ఆర్టీసీ సమ్మెపై క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కఠినంగా ఉంటూ కొరడా ఝలిపించారు. అక్టోబర్ 5 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు బస్సు ఎక్కకపోతే(విధుల్లో చేరకపోతే)… ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. డెడ్ లైన్ లోపు ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారు మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడతారని తెగేసి చెప్పేశారు. ఒకవేళ ఎవరైనా సంస్థలో చేరని పక్షంలో.. వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టినట్టుగా ప్రభుత్వం భావిస్తుందన్నారు కేసీఆర్.

విధుల్లో చేరి, బాధ్యతలు తీసుకునే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. డ్యూటీకి రాని వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బస్సెక్కించే పరిస్థితే లేదని చెపారు. ఐఏఎస్ ల కమిటీని రద్దుచేసిన కేసీఆర్.. ఈ విషయంలో కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు ఉండవని తేల్చేశారు.

Keka News Article On RTC Strike
KCR RTC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పండగొస్తే ఆర్టీసీ పండుగ చేసుకోవాలి.. పాడు చేసుకోవద్దు : పువ్వాడ

Sat Oct 5 , 2019
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసాయం చేసిందో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. ఇప్పటికే మునిగిపోతున్న సంస్థను మరింత ముంచొద్దని అన్నారు. పండుగలొస్తే గిరాకీలతో ఆర్టీసీ పండుగచేసుకోవాలి గానీ.. పాడుచేసుకోవద్దని అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా భారీ ఆదాయం వస్తుందన్నారు. ఇలాంటి టైమ్ లో యూనియన్లు సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ నాయకుల మాటల ఆటలో కార్మికులు […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..