తమన్నా అంటే నడుమే కాదు.. నటన కూడా

Tamanna SyeRaa

బాహుబలిలో అవంతికగా మాయ చేసిన తమన్నా.. మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాలో వీరవెంకట మహాలక్ష్మిగా దుమ్ములేపుతోంది. మూవీలో ఆమెకు అద్దిరిపోయే క్యారెక్టర్ దొరికింది. ఇండిపెండెంట్ భావాలున్న ఓ అమ్మాయి… సమాజంపై విరక్తితో దేవుడి కోసం  డాన్సర్ గా మారుతుంది. ఐతే.. సైరా ఇచ్చిన స్ఫూర్తితో.. ఆమె తన పంథా మార్చుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటుంది. సైరా కోసం.. దేశం కోసం.. తన ప్రాణాలను ఆర్పిస్తూ… తెల్లోళ్లను అగ్నికి ఆహుతి చేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. పవర్ ఫుల్ రోల్ లో తమన్నా తన పెర్ఫామెన్స్ ఇరగదీసింది.

తమన్నా అంటే.. ఓ గ్లామర్ ఐకన్. అభిమానులను పదిహేనేళ్లుగా తన అందమైన నడుంకు చుట్టేసుకుంది మిల్కీ బ్యూటీ. 2005లో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన తమన్నా.. ఇన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కే పరిమితం అయ్యింది.  డాన్సర్ గా, యాక్టర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న తమన్నా.. ఒకటీ అరా సినిమాల్లో పెర్ఫామెన్స్ రోల్స్ లో నటించినా.. ఆమె ఇప్పటికీ ఓ గ్లామర్ క్వీన్ మాత్రమే. తమన్నాతో స్కిన్ షో చేయించే డైరెక్టర్లే ఎక్కువ. కానీ.. సైరా మూవీలో లక్ష్మి రూపంలో తమన్నాకు ఓ సూపర్ రోల్ దొరికింది. అంతే.. తమన్నా ఇరగదీసింది.

సైరాలో డాన్సర్ పాత్ర చాలా చిన్నది. 3, 4 సీన్లు, ఓ పాటలో కనిపిస్తుందంతే. కానీ దాని ప్రభావం ప్రేక్షకులపై ఎక్కువ. ఒక్కపాటే అయినా.. మూవీలో గూస్ బంప్స్ తెప్పించే టైటిల్ సాంగ్ లో తమన్నా నటించింది. మంచి టైమింగ్ లో వచ్చే ఆ పాటలోనూ.. సినిమా నుంచి తమన్నా డిజప్పియర్ అయ్యే సీన్ లోనూ.. తమన్నా యాక్టింగ్ కెవ్వు కేక.

(Visited 34 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఢిల్లీనుంచి రాగానే ఆర్టీసీ కార్మికులకు CM డెడ్ లైన్

Sat Oct 5 , 2019
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/tamanna-mesmerises-with-her-performance-in-syeraa-movie-goosebumps-acting/"></div>మాటల్లేవ్.. చర్చల్లేవ్.. డ్యూటీకి రావాల్సిందే.. రాకపోతే.. ఉద్యోగం నుంచి పీకి పడేస్తాం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ CM కేసీఆర్ మరోసారి ఉగ్ర అవతారం ఎత్తారు. ఢిల్లీలో టూర్ ముగించుకుని హైదరాబాద్ రాగానే ఆర్టీసీ సమ్మెపై క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో కఠినంగా ఉంటూ కొరడా ఝలిపించారు. అక్టోబర్ 5 శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు బస్సు ఎక్కకపోతే(విధుల్లో చేరకపోతే)… ఉద్యోగులను ఉద్యోగం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/tamanna-mesmerises-with-her-performance-in-syeraa-movie-goosebumps-acting/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Keka News Article On RTC Strike

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..