కరోనా అప్ డేట్స్ : ఐసోలేషన్ సెంటర్ లో దేశ ప్రధాని

corona virus updates
Spread the love

కరోనా ఐసోలేషన్ సెంటర్ లో కెనెడా ప్రధానమంత్రి

కెనడా ప్రధాని భార్యకు సోకిన వైరస్

నోయిడాలో ఐసోలేషన్ సెంటర్ కు ఓ కంపెనీలోని 707మంది

 

  • ఇండియాలో కరోనా పాజిటవ్ పేషెంట్ల సంఖ్య 75కు పెరిగింది. ఢిల్లీ సరిహద్దు నగరం ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో కొత్తగా పేషెంట్ లో వైరస్ లక్షణాలు గుర్తించారు. ఫ్రాన్స్, చైనాలో పర్యటించి ఇండియాకు వచ్చిన అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. నోయిడాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న 707 మందిని క్వారంటైన్ చేశారు వైద్య అధికారులు. వారిని ఐసోలేషన్ సెంటర్ కు తీసుకెళ్లి 14రోజుల పాటు చికిత్స అందివ్వనున్నారు.
  • ఇండియాలో తొలి కరోనా డెత్ నమోదైంది. బెంగళూరుకు చెందిన 76ఏళ్ల వ్యక్తి పలు హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ తీసుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా తెలంగాణ ప్రాంతంలోనే చనిపోయాడని అధికారులు కన్ ఫామ్ చేశారు.
  • ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ లు ఉండవని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా క్లారిటీ ఇచ్చారు.
  • ఢిల్లీలో పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేశారు.
  • జేఎన్యూలో క్లాసులు, పరీక్షలు మార్చి 31కి వాయిదాపడ్డాయి.
  • చెస్ ఫెడరేషన్ నేషనల్ టోర్నమెంట్స్ ను వాయిదా వేసింది.
  • జమ్ముకశ్మీర్ లో కరోనా వైరస్ నియంత్రణ ఇంచార్జ్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంతో సస్పెండ్ చేశారు.
  • కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను రెండు వారాల పాటు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆయన భార్య సోఫీ కరోనా పాజిటివ్ అని తేల్చడంతో.. దేశ ప్రధానిని కూడా కరోనా ఐసోలేషన్ సెంటర్ లో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.
  • చైనా వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ వల్ల.. ప్రపంచవ్యాప్తంగా 4900 మంది చనిపోయారు. 1లక్ష 24వేల 330 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు.
(Visited 121 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *