పదిహేనేళ్ల అనుష్క.. పూరీ జగన్నాథ్ చెప్పిన ‘సూపర్’ స్టోరీ

Anushka Puri Jagannadh
Spread the love

అనుష్క. తెలుగు తెరపై వెలుగడం ప్రారంభించి పదిహేనేళ్లవుతోంది. నాగార్జున -పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాలో సాషా పాత్రలో తొలిసారి స్క్రీన్ పై కనిపించింది అనుష్క. ఆ సినిమా తర్వాత.. అనుష్క కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. తన నటన.. కళ్లుచెదిరే అందంతో.. టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. బాహుబలినే మెప్పించిన దేవసేనగా.. కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ రోల్ పోషించి.. తన పేరును  సుస్థిరం చేసుకుంది.

అనుష్క ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనుష్కతో సినిమాలు చేసిన రాజమౌళి, పూరీ జగన్నాథ్, రాఘవేంద్రరావు సహా.. దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అంతా పాల్గొన్నారు.

ముంబైకి చెందిన ఓ యోగా టీచర్ స్వీటీ.. అనుష్కగా ఎలా మారింది..  నటన, డాన్స్ ఎక్కడ నేర్చుకుంది…. నటనే రాని అనుష్క ఇప్పుడు ఇంతపెద్ద స్టార్ ఎలా అయింది.. ఇలాంటి ఇంట్రస్టింగ్ అంశాలు దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టేజీపై చెప్పాడు. పూరీ జగన్నాథ్ చెప్పే సంగతులు వింటుంటే.. ఓహో.. ఈ అనుష్క ఇలా మారడానికి ముందు ఇంత కథ జరిగిందా అనిపించక మానదు. ఓసారి మీరూ వినండి.

(Visited 189 times, 1 visits today)
Author: kekanews