Posted inTrending / ఫ్రెష్ కేక / వీడియో / సినిమా

ఒక్కడు 2.0.. ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ లో ఇవి గమనించారా..?

Mahesh Sarileru Neekevvaru

ప్రిన్స్ మహశ్ బాబు అభిమానులకు మంచి గిఫ్ట్ అందింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నం.1 పొజిషన్ లో ఉంది. రిలీజైన కొద్దిసేపటికే.. ఇటీవలకాలంలో ఏ వీడియోకు రానన్ని లైక్స్, వ్యూస్ తో కొత్తరికార్డ్స్ క్రియేట్ చేసింది మహేశ్ మూవీ టీజర్.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో గతంలో వచ్చిన సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా  ద గ్రేట్, ఎఫ్2లకు భిన్నంగా సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ కనిపించింది. అనిల్ రావిపూడి కామెడీ సినిమాలే కాదు.. హైలెవల్ యాక్షన్ మూవీస్ కూడా తీస్తాడని టీజర్ చెప్పింది. టీజర్ లో కామెడీకి చాన్సే లేదు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్ గా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.

మహేశ్ బాబు ఒక్కడు సినిమా చూడగానే గుర్తొస్తుంది. కొండారెడ్డి బురుజు దగ్గర సీన్స్.. ప్రకాశ్ రాజ్ కాంబినేషన్.. ఇలా… ఆనాటి మహేశ్ బాబు ఒక్కసారిగా కళ్లముందు కనిపిస్తాడు. ప్రిన్స్ మహేశ్ సోల్జర్ గా కనిపించేది కేవలం నేపథ్యంలోనే అనేది టీజర్ ను  బట్టి తెలిసిపోతుంది. సోల్జర్ అయిన మహేశ్ బాబు.. సమాజంలో జరిగే పోకడలను వ్యతిరేకించడం… సరిచేయడం .. అంతా కమర్షియల్ గా సాగిపోయే కథ ఇది. మెసేజ్ లు.. లాంటివేమీ లేకుండా..పక్కా పైసా వసూల్ సినిమాగా రాబోతోంది.

హీరోయిన్ రష్మిక నీడకూడా టీజర్ లో కనిపించలేదు. కానీ.. టీజర్ లో విజయశాంతిని హైలైట్ చేశారు.

టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ ఆర్ఆర్ కిర్రాక్ ఉంది.

భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా.. గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు.. లాంటి డైలాగ్స్ కనెక్ట్ అయ్యాయి. సంక్రాంతికి పోటీపడే సినిమాల్లో మొగుడే అవుతాడా లేదా చూడాలి. జనవరి 12నకాకుండా.. ఒకరోజు ముందే మూవీని రిలీజ్ చేస్తామని యూనిట్ చెబుతోంది.

 

Rashmika Samantha Pushpa Item Song Regina
Rashmika Samantha Pushpa Item Song Regina