కరోనా అయినా చదువు ఆగదు…“నారాయణ” మంత్రం !

Spread the love

కరోనా అయినా చదువు ఆగదు…“నారాయణ” మంత్రం !

వ్యాపారం చేయ‌డం, లాభాల‌ను సాధించ‌డం, కార్పోరేట్ రంగంలో ప్ర‌తీ కంపెనీ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే. అయితే లాభార్జనే ద్యేయంగా ప‌నిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేట‌లో ప‌డి సామాజిక బాధ్యత‌ను విస్మరిస్తాయి. పూర్తి స్థాయి వ్యాపార సంస్థలుగా మారిపోయాక సామాజిక సేవ‌, బాధ్యత‌ల‌ను గాలికి వదిలేస్తాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ప్రారంభం నుంచి వ్యాపార ల‌క్ష్యాన్ని సాధిస్తూనే కీల‌కమైన సామాజిక బాధ్యత‌ను మాత్రం మ‌ర్చిపోకుండా నెర‌వేరుస్తూ ఉంటాయి. అలాంటి సంస్థే నారాయణ.

కరోనా నేపధ్యంలో దేశం మొత్తం విధించిన లాక్‌డౌన్‌తో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని నారాయణ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టా యి. ఈ క్లాసుల ద్వారా టీచర్‌ చెప్పే పాఠ్యాంశాలను నేరుగా ఇంట్లోనే వినవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డైలీ అసైన్‌మెంట్లు కూడా ఇందులోనే ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీల పరిధిలో అమలు చేస్తున్నారు. రోజుకు సగటున పదివేల మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను వీక్షిస్తున్నారని, మొత్తంగా 75 వేల మందికి పైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందుతున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో కూడా పిల్లలు టీవీ లకి అతుక్కుపోకుండా ఇలాంటి ప్రయత్నం చేయడం అభినందనీయం.

(Visited 55 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *