నిప్పులా జ్వలించిన నినాదం.. నేతాజీ

Spread the love

(Source:KrantiDevMitra)

‘ స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..’
” మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వేచ్ఛనిస్తాను..” భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో మంత్రంలా వినిపించిన సమర నినాదం ఇది.. ‘ఛలో ఢిల్లీ ‘, ‘జైహింద్ ‘ అంటూ ఆ మహా నాయకుడు ఇచ్చిన నినాదాలు ఈనాటికీ సజీవంగా ఉన్నాయి.. భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి విదేశీ నేలపై తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోధుడాయన..
జననమే తప్ప మరణం లేని మహా నేత.. భారత దేశ ప్రజల హృదయాల్లో ‘నేతాజీ’గా చిరస్థాయిగా నిలచిన అమరుడు.. అతి కొద్ది సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనంతటి అభిమానాన్ని చూరగొన్న మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్..
జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నేతాజీ 125 వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహనీయున్ని గుర్తు చేసుకుందాం.. జైహింద్
(నేతాజీ జయంతి సందర్భంగా జాగృతి పత్రికలో నేను రాసిన ‘నిప్పై జ్వలించిన నినాదం.. జైహింద్’ అందరూ చదవాల్సిందిగా మనవి)
#netaji #NetajiSubhasChandraBose

(Visited 202 times, 1 visits today)
Author: kekanews