ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. టీవీ నటి నవ్యస్వామి కరోనా పాజిటివ్ అయ్యారు. ఈటీవీలో ప్రసారం అయిన నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు నవ్యస్వామి.
అందమైన నవ్వు… మంచి యాక్టింగ్ తోపాటు.. చలాకీతనం ఆమెను తెలుగువారికి దగ్గరచేసింది. నాపేరు మీనాక్షితో పాటు.. జెమిని, మా టీవీ, జీ తెలుగు టీవీ ఛానెళ్లలో పాపులర్ టీవీ సీరియల్స్ లో ఆమె నటిస్తోంది. పలు ఎంటర టైన్ మెంట్ రియాల్టీ షోల్లోనూ డాన్స్ చేసి తన అందాలతో ఆకట్టుకుంది.
నవ్యస్వామి కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన యాక్ట్రెస్. కన్నడ పరిశ్రమతో పాటే తెలుగులోనూ సీరియల్స్ చేస్తూ.. బాగా సంపాదిస్తోంది. లాక్ డౌన్ తర్వాత.. సీరియల్స్ షూటింగ్స్ మళ్లీ మొదలుకావడంతో… ఆమె మళ్లీ కెమెరా ముందు మేకప్ వేసుకుంటున్నారు. పలు సింప్టమ్స్ కనిపించడంతో ఆమె టెస్టులు చేయించుకున్నారు. తాజాగా ఆమెకు కరోనా సోకడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. ఆమె కుటుంబసభ్యులు కూడా క్వారంటైన్ అయ్యారు.