Abu Dhabi Telangana Celebrations : అబుదాబిలో ఘనంగా తెలంగాణ పదేళ్ల అవతరణ దినోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి నగరం లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఘనం గా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఉత్సవాలకు ప్రాంగణంగా అబుదాబి లోని BS ఈవెంట్స్ హాల్ అయింది. ఈ కార్యక్రమం లో మొదటగా దీప ప్రజ్వలన మరియు గణపతి వందన తో ప్రారంభించారు. ఆ తరువాత తెలంగాణ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి పటానికి పూల మాల వేసి అసోసియేషన్ కార్య వర్గ సభ్యులందరు జోహార్లు అర్పించారు. కార్యక్రమాన్ని చిన్నారులు పాడిన తెలంగాణ ఉద్యమ గీతమైన జయహే జయహే తెలంగాణ తో వచ్చిన వారందరిలో ఉద్యమ కాలం నాటి స్మృతులను గుర్తు కు తెస్తూ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్ద్యేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్ఫూర్తి అని, దాని మూలాలనూ ముందు తరాలకు చేరవేసే భాద్యత తల్లిదండ్రులదేనని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు తెలియజేశారు. తదనంతరం చాలా మంది చిన్నారులు చేసిన తెలంగాణ ఆట పాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమాన్ని చిన్నారుల ద్వారా ఇంత ఆకర్షితంగా చూపించడానికి సహకరించిన చిన్నారుల తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని మరియు ఈ రకంగా ముందు తరాలకు తెలంగాణ చరిత్ర మరియు కళలు పంచిన వాళ్ళము అవుతామని కార్యక్రమానికి ప్రోగ్రాం యాంకర్ గా వ్యవహరించిన గోపినాథ్ మల్లెల గారు అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు గా వచ్చిన మల్లేష్ కోరేపు తనదయిన శైలి లో తెలంగాణ పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా జూన్ 9 నాడు దుబాయి లో స్పార్క్ మీడియా మరియు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జరుగనున్న దశాబ్ది ఉత్సవాల వేడుకల పోస్టర్ రిలీజ్ చేశారు. కార్య నిర్వాహకులు దశాబ్ది ఉత్సవాల గుర్తు గా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొని తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఎమిరేట్స్ ఎన్ బి డి బ్యాంకు వారు ఇచ్చిన బహుమతుల పంపిణి చేసారు అని కార్య నిర్వాహక సభ్యుడు అశోక్ గుంటక తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్యనిర్వాహక సభ్యులు పావని శ్రీనివాస్, అర్చన వంశీ, పద్మజ గంగారెడ్డి, లతా గోపాల్, దీప్తి శ్రీనివాస్, ప్రియ వెంకట్ రెడ్డి మరియు లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.