కడపలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కడప లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వై.ఎస్.షర్మిలకు అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నట్టు సమాచారం. బ్రదర్ అనిల్‌కుమార్ ప్రచారం షర్మిలకు బాగా కలిసి వచ్చింది. మొదటిసారిగా క్రిస్టియన్లందరూ వన్‌సైడెడ్‌గా షర్మిలకు ఓటు వేస్తున్నట్టు సమాచారం. క్రిస్టియన్లు షర్మిలకు మద్దతు ఇస్తున్నది చూసి ముస్లింలు కూడా గంపగుత్తగా షర్మిలకే ఓట్లు వేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ కడప పర్యటన కూడా షర్మిలకు అనుకూలంగా మారింది. ఇడుపులపాయను రాహుల్ సందర్శించడం కూడా షర్మిలకు అనుకూలంగా మారింది. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డి అభిమానులు కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు లోక్‌సభకు వచ్చేసరికి షర్మిలకు ఓటు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు కూడా బాహాటంగా షర్మిలకు మద్దతు ఇస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి షర్మిలకు ఓటు వేద్దామని టీడీపీ క్యాడర్ నిర్ణయించుకున్నదట! మొత్తంగా చూస్తే కడప లోక్‌సభలో అసలేమాత్రం ప్రభావం చూపరని అనుకున్న షర్మిల ఇప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.