నువ్వు దొరవేమో.. మేం బానిసలం కాదు.. యాదుంచుకో

(సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్.. కేక రీడర్స్ కోసం)

తెలంగాణాని బద్నామ్ చేస్తుంది ఎవరు?
హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బ తీస్తుంది ఎవరు?

కరోనా అడుగే పెట్టనియనూ అన్నది ఎవరూ?
ప్రపంచ స్థాయిలో వైద్యం అందిస్తామన్నది ఎవరు?
22 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కరోనా బతకనే బతకదూ అని చెప్పింది ఎవరు
కోతలూ,కూతలూ,కూసింది ఎవరు?

సకల సదుపాయాలు ఉన్నాయి అన్నది ఎవరు??

ఎంత ఖర్చుకి అయినా వెనకాడనూ అన్నది ఎవరు?

కనీసం ప్రైమరీ కాంటాక్ట్ లు కూడా సేకరించకుండా విఫలం అయింది ఎవరు?

టెస్టులు చేస్తే ప్రైజ్లు ఇస్తారా అని నిర్లక్ష్యంగా మాట్లాడింది ఎవరు ??
ఎవరికి కరోనా వచ్చినా గాంధీకి రావాలి అన్నది ఎవరు ?ఎమ్యెల్యేలకి వస్తే ప్రైవేట్ కి పరుగులు పెట్టింది ఎవరు

విలేఖర్లు ప్రశ్నలు అడిగితే కారెడ్డాలు చేసింది ఎవరు?
దేశమంతా టెస్టులు చేస్తుంటే నిమ్మకు నీరేత్తినట్లు ఉన్నది ఎవరు?

ఏప్రిల్ 7 కె పోతదీ,మే 8 కి కరోనా ఉండదీ అన్నది ఎవరు??

లక్ష మందికి ఐనా చికిత్స ఇప్పిస్తామ్ అన్నది ఎవరు ?

ధనిక రాష్ట్రం అన్నది ఎవరు? జీతాలు కోతలు పెట్టింది ఎవరు?

నేనున్నా అన్నది ఎవరు? జనాలు సస్తుంటే మౌనంగా ఉన్నది ఎవరు??
లెక్క పత్రం లేకుండా అన్నీ జోన్లూ గ్రీన్ జోన్లు అని ప్రకటించింది ఎవరు?

కరోనా ని జయించేసినమ్ అన్నట్లు ఊదర గొట్టింది ఎవరు?
హై కోర్టు చేత చీవాట్లు తిన్నది ఎవరు?

దేశంలోకెల్లా టెస్టుల్లో వెనుక పడ్డది ఎవరు?

వచ్చింది ప్రపంచమంతా భయపడుతున్న ఒక ప్రాణాంతక వ్యాధి

పదవిలో ఉన్నందుకు భాద్యతతో వ్యవహరిస్తే నీ వెనకనే ఉంతుండే,జేజేలు కొడుతుండే

మాటలు కోటలు దాటుతాయి..చేతలు చెరువు గట్టు కూడా దాటాదు
టెస్టులు చేయండి… కాస్త భాద్యతా యుతంగా ఉండడీ అని పౌరులుగా మేం అడిగితే నోటికొచ్చినట్లు వాగుతార్రా బానిస కుక్కల్లార??

పైన చెప్పినవి ఎవరి ప్రోద్బలంతో చెప్పాడు దొర? మీరేం చెప్తే అది వినాలే.రోగమొస్తే సావాలే.మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి?
తెలంగాణా పేరును బద్నామ్ చేసింది మీరు.

వివరాలు దాచి,నిజాలు దాచి,కరోనానే లేదు అన్నట్లు తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టింది మీరు

ఓట్ల కోసం జనాల ప్రాణాల మీదకు తెచ్చింది మీరు

నోరు ఎటు పడితే అట్లా మాట్లాడేది…ఎవరన్నా గొంతెత్తితే అడ్డగోలు విమర్శలు చేసుడు

బండారం బయట పడితే తెలంగాణ సెంటిమెంట్ ను లేపుడు

ఆరేళ్లు సర్కారు దావఖానాలు బాగు చేయలే..
ఇదీ ఆరేళ్లలో వైద్యం,ఆరోగ్యం మీద మీరు చూపెట్టిన శ్రద్ద
బతుకంతా సెంటిమెంట్ నే అడ్డు పెట్కోని లాక్కొస్తా అంటే నడవదు దొరా

నువు లేక మునుపు కూడా ఉద్యమం ఉందీ,పోరాటం ఉంది.
పోరాటం ఈ గడ్డలోనే ఉంది

అవతలోడు మోసం చేస్తేనే లడాయికి దిగినోళ్లమ్,
నమ్మి అధికారం ఇస్తే నెత్తి నేక్కి కూసుంటా అంటే బరాబర్ నిలదీస్తం

ప్రాణాలు పోతున్నాయ్,కాపడండ్రా అంటే రాజకీయలంటార్రా బద్మాష్ గళ్ళారా?

నీకు రోగమొస్తే పైసలో,పరపతో కాపాడ్తది,
మరి మేం,సామాన్యులమ్ ఎడ పోవాలే.

నీకు వోట్లు ఎసినందుకు మేం సావల్నా

పని చేస్తే ప్రశంస – విస్మరిస్తే be bjవిమర్శ బరాబర్ ఉంటది

నువ్వు దొరవేమో.మేం బానిసలం కాదు ..యాదుంచుకో
….. ఓ సామాన్యుని ఆవేదన

(Visited 97 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *