రగులుతోంది మహా పొద.. ఫడ్నవీస్ రాజీనామా

Spread the love

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.  అర్ధరాత్రి ఉరుకులు, పరుగులతో నవంబర్ 23 నాడు మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలతో… అత్యవసర ఆదేశాలతో.. మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ తీసివేసి… సీఎంగా ఫడ్నవీస్ ను ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు.

Read Also : జార్జిరెడ్డి రివ్యూ : బయోపిక్ కాదు.. కమర్షియల్ సినిమా

ఐతే.. సీఎం ఫడ్నవీస్ పదవి, ప్రభుత్వం మూడురోజుల ముచ్చటే అయింది. రేపు బుధవారం  సాయంత్రం ఐదింటిలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి , శాసనసభకు ఆదేశాలు ఇవ్వడంతో… రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన రాజకీయ అనుభవాన్ని మధించారు. తన సోదరుడి కొడుకు, పార్టీలో ముసలం పుట్టించిన అజిత్ పవార్ తో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయించారు. ఆ తర్వాత… 105 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న బీజేపీ ఏం చేయలేకపోయింది. బలపరీక్షకు సమయం ఎక్కువగా లేకపోవడం.. తాను తన పార్టీని చీల్చలేకపోతున్నానని అజిత్ పవార్ తేల్చిచెప్పడంతో.. బీజేపీ ఏమీ  చేయలేకపోయింది.

Read Also : డిపోలకు వస్తే తాటతీస్తాం.. ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్

సీఎం ఫడ్నవీస్ ఓపెన్ అయ్యారు. జరిగిన పరిణామాలను మీడియాకు చెప్పారు. ఎన్సీపీ ఆరోపిస్తున్నట్టుగా తాము ఎవరినీ ప్రలోభపెట్టలేదన్నారు. అజిత్ పవార్ మద్దతు ఇస్తేనే .. ఎమ్మెల్యేలను తీసుకొస్తానని చెప్పడంతోనే ప్రమాణం చేశామన్నారు. ఐతే..  అజిత్ పవార్ రాజీనామాతో తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమయ్యామన్నారు. ఆ తర్వాత.. ఆయన రాజ్ భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖ గవర్నర్ కు అందించారు.

(Visited 45 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *