iQOO 3 వస్తోంది.. అదిరిపోయే ఫీచర్స్

iQOO3
Spread the love

ప్రీమియం మొబైల్ ఫోన్లు కొనుక్కోవాలనుకుంటున్నవారికోసం బ్రాండ్ న్యూ ఫ్లాగ్ షిప్ ఫోన్ వస్తోంది. అదే iQOO3 5G ఫోన్. మాన్ స్టర్ ఇన్ సైడ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. చైనా బ్రాండ్ Vivo వారి సబ్ బ్రాండ్ ఈ iQOO. లాస్టియర్ చైనాలో ఈ బ్రాండ్ ను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. ఈసారి 5జీ టెక్నాలజీతో ఇండియాలో ఈ ఫోన్ ను రిలీజ్ చేస్తున్నారు. మార్చి నాలుగో తేదీన ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాష్ సేల్ లో ఈ మొబైల్ ను కొనుక్కోవచ్చు.

అదిరిపోయే ఫీచర్స్

  • గేమింగ్ కోసం పవర్ ఫుల్ ప్రాసెసర్ తో రూపొందించిన ఫోన్ ఇది.
  • iQOO3 ఫోన్ లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఫాస్ట్ గా ఉండటమే కాదు.. లాంగ్ బ్యాటరీ.. హై రెజల్యూషన్ సౌండ్ క్లారిటీ.. సూపర్ ఫాస్ట్ చార్జింగ్.. హై ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఆ స్పెషాలిటీలు అన్నీ ఓసారి చూద్దాం.
  • 5జీ టెక్నాలజీ బిల్టిన్ సపోర్ట్ తో వస్తోంది iQOO3. 2జీ, 3జీ, 4జీ, 4జీ+ టెక్నాలజీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ నెట్ వర్క్, సిమ్ త్వరలోనే రాబోతున్నాయి. అలా.. అడ్వాన్స్ గా ఈ మొబైల్ ను అందుబాటులోకి తెస్తోంది iQOO ఇండియా కంపెనీ.
  • ఫ్రంట్ సింగిల్ కెమెరా.. రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో ఫోన్ వస్తోంది.
  • మ్యూజిక్ లవర్స్ కు  మంచి ఫోన్. ఇది సౌండ్ స్పెషాలిటీ ఫోన్. హై ఫై అనే డెడికేటెడ్ చిప్ తో హై రెజల్యూషన్ సౌండ్ ను ఇయర్ ఫోన్ లో వినొచ్చు. బాక్స్ లో ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
  • పికప్ అండ్ డ్రాప్ అని కొత్త ఫీచర్ ఇస్తున్నారు. ఫోన్ కు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా.. 1800 572 4700 నంబర్ కు కాల్ చేస్తే.. వాళ్లే వచ్చి పికప్ చేసుకుని.. రిపేర్ చేసి ఇస్తారు. గ్యారంటీని బట్టి.. ఫ్రీ సర్వీస్ ఉంటుంది. కానీ.. స్టోర్ కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని కంపెనీ చెబుతోంది.
  • 55వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో సగంబ్యాటరీ చార్జింగ్ పూర్తవుతుంది.
  • డిస్ ప్లే 6.44 ఇంచెస్
  • రేర్ కెమెరా – 48, 13, 13, 2 మెగాపిక్సెల్స్
  • ఫ్రంట్ కెమెరా -16 మెగా పిక్సెల్స్
  • బ్యాటరీ – 4440 ఎంఏహెచ్
  • ఓఎస్ –ఆడ్రాయిడ్ 10
  • ప్రాసెసర్ –  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865
  • iQOO 4G 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.36,990
  • iQOO 4G 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.39,990
  • iQOO 5G 12జీబీ+256జీబీ ఫ్లాగ్ షిప్ వేరియంట్ ధర.రూ.44, 990గా నిర్ణయించారు. 

 

(Visited 63 times, 1 visits today)
Author: kekanews