నో సర్… మోడీ సోషల్ మీడియా వీడొద్దన్న జనం

Modi wants to quit social media
Spread the love

ఈ ఆదివారం(మార్చి 8) సోషల్ మీడియాను వదిలేస్తున్నా అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రాత్రి 9 గంటల టైమ్ లో చేసిన ట్వీట్ దేశమంతటా సంచలనం రేపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లను తొలగించబోతున్నాను అని ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్లలో తెలిపారు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది.

ఆయా ప్లాట్ ఫామ్స్ లో భారీ ఎత్తున షాకింగ్ ఎక్స్ ప్రెషన్స్, షేర్లు, కామెంట్లు వచ్చాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ లోనూ ఓ హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండింగ్ అయింది. అదే #NoSir.

#NoSir ట్యాగ్ ను మోడీ అభిమానులంతా ఉపయోగించి ట్వీట్లు, పోస్టులు పెట్టారు. మోడీ వచ్చాకే సోషల్ మీడియాకు ఊపు వచ్చింది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాలో ఓ ప్రభంజనం సృష్టించి ప్రధాని అయిన మోడీ.. ఆ తర్వాత.. ఎందరినో ఆ దిశగా నడిపారు. మోడీ చూపిన ఉత్సాహంతోనే.. కోట్లాదిమంది సోషల్ మీడియాలో అకౌంట్లుతెరిచారు. అలాంటి మోడీ ఇపుడు సోషల్ మీడియాకు దూరం అవుతున్నాాని ప్రకటింంచడంతో.. స్పెక్యులేషన్స్ పెరిగిపోతున్నాయి.

ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు, 46 మంది ప్రాణాలు పోవడానికి కారణం సోషల్ మీడియానే అని మోడీ అనుకోవడమే ఈ నిర్ణయం వెనక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. సోషల్ మీడియాతో మంచి , చెడు రెండూ ఉన్నప్పటికీ.. చెడు కారణంగా పెను నష్టం జరుగుతోందని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రూల్స్ స్ట్రిక్ట్ చేసేసిన ఇండియా.. మరింత కఠినంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. క్రమంగా .. ఇండియాలో సోషల్ మీడియాను బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కొందరు చెబుతున్నారు.

ట్విట్టర్ లో 53.3 మిలియన్లు, ఫేస్ బుక్ లో 44మిలియన్ల ఫాలోయర్లతో  ప్రధాని మోడీ ప్రపంచంలోనే టాప్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా పేరు తెచ్చుకున్నారు.

(Visited 98 times, 1 visits today)
Author: kekanews