తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు ఓపెన్ కాబోతున్నాయి. లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగించిన కేసీఆర్.. కేంద్రం సడలింపులు అన్నీ అమలుచేస్తామన్నారు. మే 6 నుంచి తెలంగాణలోని అన్ని జోన్లలో వైన్ షాపులు ఓపెన్ చేస్తామన్నారు. కంటెయిన్మెంట్ జోన్లలోని 15 షాపులు తప్ప తప్ప మిగతా అన్ని ఏరియాల్లో లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తామన్నారు.
లిక్కర్ పై కేసీఆర్ స్పీచ్ షార్ట్ కట్ గా చూద్దాం.
★ నో మాస్క్.. నో లిక్కర్
★ మూడేళ్లు కష్టపడి రాష్ట్రంలో గుడంబా లేకుండా చేశాం..
★ వెయ్యి కోట్లు ఖర్చు చేసి గుడుంబా బంద్ చేశాము.. .
★ ఇప్పుడు గుడంబా స్టార్ట్ అయ్యింది..
★ కేంద్ర నిబంధనలతో పలు రాష్ట్రాల్లో మద్యం స్టార్ట్ అయ్యింది. దాంతో రేపటి నుంచి వైన్ షాపులు తెరుస్తాం..
రెడ్ జోన్ లలో కూడా ఓపెన్ చేస్తాం..
★ కానీ 15 షాపులు.. కంటైన్ మెంట్ జోన్ లలో తెరవం..
★ 16 శాతం రేట్లు పెంచుతాం..
★ చీప్ లిక్కర్ పై 11 శాతం పెంచుతాం.