చిరంజీవి సైరా ట్రైలర్ రిలీజ్… అనుష్క ఉందా లేదా..?

చిరంజీవి నటించిన అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి.. మైండ్ బ్లోయింగ్ అండ్ ఆల్ టైమ్ అల్టిమేట్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైరా ఒకేసారి విడుదలవుతోంది. సాహో తర్వాత ఓ సౌతిండియన్ సినిమా జాతీయ స్థాయిలో విడుదల అవుతుండటం… చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా లాంటివాళ్లు నటించిన మల్టీ స్టారర్ కావడంతో..దేశమంతటా మూవీ అభిమానుల్లో సైరా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది.

స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి అనే పోరాటయోధుడి నిజ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ నిర్మాణంలో.. సురేందర్ రెడ్డి సైరాను రూపొందించారు. అమిత్ త్రివేది మ్యూజిక్… జూలియస్ పకియామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించారు.  సైరా నరసింహారెడ్డి కథకు.. అవసరమైన హంగులు జోడించి ఈ సినిమాను రూపొందించారు. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా సినిమా టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. లేటెస్ట్ గా.. ట్రైలర్ ను విడుదల చేశారు.

మేకింగ్ లో.. డైలాగుల్లో… అప్పటి బానిస బతుకునుచూపిస్తూ… అప్పటి పోరాట వీరుల త్యాగాలు, వారి పోరాటాలను అద్భుతంగా తీసినట్టు సైరా సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీ ఆఖరి కోరిక ఏంటి అని బ్రిటీష్ కోర్డు అడిగినప్పుడు…. గెట్ ఔట్ ఆఫ్ మై కంట్రీ.. భారత మాతకీ జై అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు.. భారీ యుద్ధ సన్నివేశాలు.. గూస్ బంప్స్ అనిపించేలా ఉన్నాయి.

సైరా ట్రైలర్ ఆలిండియాలో సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి సహా.. మహామహులు సైరా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్లుచేశారు.

సైరా ఐదు భాషల్లో రిలీజవుతోంది. ఐతే.. తెలుగులో మాత్రమే చిరంజీవి డబ్బింగ్ చెప్పారు. మిగతా భాషల్లో చిరంజీవి డబ్బింగ్ చెప్పలేదు. ఐతే.. సుదీప్, విజయ్ సేతుపతి మాత్రం అన్ని భాషల్లోనూ చెప్పారు.

అమితాబ్ బచ్చన్ కేవలం హిందీలో మాత్రమే డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్ హిందీ ట్రైలర్ లోనే వినిపిస్తుంది.

అనుష్క సంగతేంటి…

అనుష్కకూడా సైరాలో నటించిందని చెబుతూ వచ్చారు. కానీ.. ట్రైలర్ లో అనుష్క కనిపించలేదు. టైటిల్స్ లో ఆమె పేరు లేదు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా… అతిథి పాత్రలో అనుష్క నటించిందని వార్తలు వచ్చినప్పటికీ.. అదింకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. రీసెంట్ గా చిరంజీవి,రామ్ చరణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అనుష్క నటిస్తోంది అని. ఐతే.. ట్రైలర్ ను మించిన సర్ ప్రైజ్ లు సినిమాలో ఉంచాలని టీమ్ భావించినట్టు సమాచారం. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చనిపోయిన పదేళ్లకు ఝాన్సీ లక్ష్మీబాయి మరణించారు. నరసింహారెడ్డి పోరాటాన్ని ఝాన్సీ రాణి ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకునేవారని చరిత్ర చెబుతోంది.అలా.. లక్ష్మీబాయి నరసింహారెడ్డి గొప్పతనాన్ని చెబుతూ ఇంట్రొడక్షన్ ఇచ్చాకే మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అంటే… సినిమా మొదట్లోనే అనుష్క కనిపించబోతోందన్నమాట. వావ్ .. కదా.

మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ కూడా ఇవాళ జరపాల్సింది. కానీ.. కేటీఆర్ బిజీగా ఉండటం.. వాతావరణ పరిస్తితులు అనుకూలంగా లేకపోవడంతో.. ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు మూవీ మేకర్స్ చెప్పారు.. ఐతే… జస్ట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రిలీజ్ కు ముందు.. గ్రాండ్ గా ప్రి-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

(Visited 59 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *