సైరా తల నరికి 30 ఏళ్లు వేలాడేశారని తెలుసా..

1

సైరా మూవీ విశేషాలను ప్రొడ్యూసర్ రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి …ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియాకు చెప్పారు. రికార్డులు, కలెక్షన్లు లెక్కలు వేసి సైరా మూవీ తీయలేదని హీరో రామ్ చరణ్ చెప్పాడు. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసంచేస్తున్న కసరత్తులతో మ్యాన్లీగా , మీసాలు, కండలతో కనిపించాడు రామ్ చరణ్. మూవీ రేంజ్ ఏంటో అప్పుడే చెప్పలేమని అన్నారు. ఎంతడబ్బు వస్తుంది అని మాత్రం లెక్క చూసుకుని ఖర్చుపెట్టలేదని.. ఎప్పటికీ నిలిచిపోయే సినిమా తీయాలని మాత్రమే అనుకున్నామన్నారు రామ్ చరణ్. తమ చరిత్రను పక్కదోవ పట్టించారంటూ వస్తున్న విమర్శలు, నరసింహారెడ్డి కుటుంబసభ్యులతో చర్చించానని అన్నారు చరణ్.

పలు భాషలకు చెందిన హీరోలను తీసుకోవడం అనేది కథా పరంగా జరిగిందే అన్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. లేని పాత్రలను క్రియేట్ చేయలేదన్నారు. నరసింహారెడ్డి సినిమాకు విషాదాంతం ఉంటుందని.. ఐతే..అదే ఈ మూవీకి తొలి సక్సెస్ అన్నారు డైరెక్టర్. బ్రిటీష్ వారిని ఎంతో వణికించాడు కాబట్టే… ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఉరిశిక్ష వేసిన తర్వాత.. ఆయన తలను నరికి 30ఏళ్ల పాటు..అలా ఎత్తున వేలాడ దీసారని.. దీంతో జనంలో భయం పుట్టించాలని బ్రిటీష్ వాళ్లు అనుకున్నారని చెప్పారు సురేందర్ రెడ్డి. ఇంతకంటే..బలమైన క్యారెక్టర్ … ఓ సినిమా కథాంశంగా మరోటి దొరుకుతుందా అని ప్రశ్నించారు సురేందర్ రెడ్డి. సినిమా కథపై చాలా రీసర్చ్ చేసి తీశామని చెప్పారు.

One thought on “సైరా తల నరికి 30 ఏళ్లు వేలాడేశారని తెలుసా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చిరంజీవి సైరా ట్రైలర్ - తెలుగు

Thu Sep 19 , 2019

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..