కండ్లళ్ల నీళ్లు తెప్పించే పాట… అవ్వ మనవడి పాట

Kanakavva avva Manavadi Song

అవ్వ మనవడి పాట, Kanakavva , Hanmanth Yadav , Yashpal , Mictv

మైక్ టీవీ నుంచి మరో మంచి పాట వచ్చింది. అవ్వ మనవడి పాట.. హృదయాన్ని హత్తుకుంటోంది.

పల్లెలో ఓ అవ్వ, మనవడి మధ్య ప్రేమ, ఆప్యాయత… ఉద్యోగం కోసం పట్నం వెళ్లిన మనవడు…. దూరమైన బంధాన్ని గుర్తుచేసుకుని అవ్వ కన్నీళ్లు.. అవ్వను చూసేందుకు పట్నం నుంచి పల్లెకు పోయిన మనవడు.. ఇదీ కథ.

చిన్నప్పటినుంచి ఎలా పెంచింది.. ఏం తినిపించింది.. అన్నీ చూపించారు.

ప్రతి ఒక్కరు తమ బాల్యాన్ని … అమ్మను గుర్తుచేసుకోకుండా ఉండలేరు.

పట్నంలో ఉంటున్న ప్రతిఒక్కరు… పల్లెలో తమ చిన్నప్పటి బతుకును ఊహించుకుని.. ఏ బతుకురా ఇది అని అనుకోక మానరు.

అమ్మ ప్రేమను.. అవ్వ ఆప్యాయతను చూపించే ఆ పాటను మీరూ చూడండి.

పాటకు కామెంట్లు చూస్తేనే… ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో చెప్పేయొచ్చు.

ఓ కామెంట్..

గతంలోకి గుంజుకుపోతున్న పాట. అమ్మ గోరు ముద్దను, అవ్వ పెట్టిన మొదటి ముద్దును గుర్తు చేస్తున్న పాట. కనకవ్వ, హన్మంతు జీవి పెట్టి పాడారు. యశ్ పాల్ పాటకు ప్రాణం పోశాడు.సంగీతం ఇఫ్రహిం.

(Visited 165 times, 1 visits today)