సరిలేరు నీకెవ్వరు : కేక రివ్యూ

mahesh-babu-sarileru-neekevvaru-movie-review-and-rating

భారీ అంచనాలతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సంక్రాంతి పండక్కి సరిలేరు నీకెవ్వరు అనే మూవీతో థియేటర్ లోకి వచ్చారు. ఎఫ్2తో కమర్షియల్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి, మహేశ్ కు బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ అందించిన దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందడం…. ప్రమోషన్, ట్రైలర్, ప్రి రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడం.. మూవీపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు ఎంతవరకు అందుకుందో ఓసారి చూద్దాం.

భారీ మాస్, క్లాస్ ఇమేజ్ ఉన్న ఓ అగ్ర హీరోకు… కమర్షియల్ హంగులున్న కథ రూపొందించి… ట్రెండింగ్ లో ఉన్న బోర్డర్-సోల్జర్ బ్యాక్ డ్రాప్ ను కలిపి… ఓ నాలుగు బీభత్సమైన ఎలివేషన్స్  ను రాసుకుని.. కడుపుబ్బా నవ్విస్తే.. అది సరిలేరు నీకెవ్వరు అవుతుందని చెప్పొచ్చు.

సరిలేరు మూవీని మహేశ్ బాబు తన భుజాలపై మోశాడు. సోల్జర్ గా.. అన్యాయాన్ని ఎదిరించే అసామాన్యుడిగా.. మహేశ్ బాబు చరిష్మా.. ఆయన అందం.. కటౌట్ … అలా ఫ్రేమ్ 2 ఫ్రేమ్ రిజిస్టర్ అయిపోతాయి.

సోల్జర్ గా ఇంట్రొడక్షన్ ఇచ్చిన మహేశ్ .. ఆర్మీ ఆపరేషన్ లో మొదట్లోనే ముద్ర పడేస్తాడు. ఆ తర్వాత.. దూకుడులో మహేశ్ ను గుర్తుచేస్తూనే అలరించాడు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి బీభత్సమైన మాస్ లుక్, ఊర మాస్ ఫైట్ తో చెలరేగిపోయాడు. మహేశ్ ప్రెజెన్స్, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, కెమెరా వర్క్, దర్శకుడి ప్రతిభ కారణంగా.. ఇంటర్వెల్ బ్యాంగ్ బీభత్సంగా వచ్చింది. సెకండాఫ్ లో నల్లమల ఫైట్ కూడా బాగుంది. సోల్జర్ గా లీడర్లకు, ప్రకాశ్ రాజ్ కు మహేశ్ ఇచ్చే క్లాసులు కొన్ని మాత్రమే వర్కవుట్ అయ్యాయి.

ఈ సినిమాకు మరో బలం విజయశాంతి. హుందాతనం, బాధ్యత, త్యాగం కలిసిన ఆ పాత్రలో లేడీ అమితాబ్ బాగా నటించింది. మహేశ్, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి.

ప్రి క్లైమాక్స్ లోనే మెయిన్ ప్లాట్ ను ముగించేయడం కరెక్ట్ కాదనిపించింది. ప్రకాశ్ రాజ్ మార్పు ను ఎక్స్ టెండెండ్ క్లైమాక్ గా తీసుకోవడంతో… మూవీ సాగదీసినట్టు అనిపిస్తుంది.

ఓసారి హైలైట్స్ – సైడ్ లైట్స్ చెప్పుకుంటే..

దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం: పాటల్లో యావరేజీ మార్కులు పడినా కూడా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. చాలా సీన్లు… బీజీఎంతో ఓ రేంజ్ లోకి వెళ్లిపోయాయి.

ట్రెయిన్ లో రష్మిక, సంగీత బ్యాచ్ కామెడీ… బండ్లగణేశ్ ఎపిసోడ్ కంటే… రావురమేశ్ చెప్పే స్టోరీనే కామన్ ఆడియన్స్ ను పగలబడి నవ్విస్తుంది. రష్మిక కన్నా..సంగీత తన ప్రెజెన్స్ ను చాటుకుంది.

కాకపోతే.. చివర్లో వచ్చే మైండ్ బ్లాక్ సాంగ్ లో రష్మిక అందాల విందు చేసి కేక పెట్టించింది. తమన్నా పార్టీ సాంగ్… మూవీకి మంచి బిగినింగ్ రావడంలో భాగమైంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి 100 శాతం ప్రతి సీన్ లోనూ ప్రేక్షకుల మదిలో మెదులుతుంటాడు. ఎందుకంటే డైలాగులు, కథ రాసుకున్నది.. ఆయనే కాబట్టి. శ్రీనువైట్ల పర్ఫెక్ట్ కామెడీని… బీభత్సమైన ఎలివేషన్స్ రాసుకునే కొరటాల శివను మిక్స్ చేస్తే.. ఎలా ఉంటుందో.. అలా తనదైన స్టైల్లో అనిల్ రావిపూడి డిస్టింక్షన్ మార్కులు వేయించుకున్నాడు. ఐతే.. విలన్ తీరును మార్చాలని మహేశ్ బాబు అనుకోవడం.. ఆ ఎపిసోడ్ ను కామెడీగా డీల్ చేయడంతో.. అంత వెయిట్ పడలేదు.  క్లైమాక్స్ డల్ అయింది. ప్రి క్లైమాక్స్ లో సోల్జర్ సాంగ్ ఎక్కువ స్కోర్ చేసింది.

హైలైట్స్ : మహేశ్ బాబు పెర్ఫామెన్స్, విజయశాంతి అప్పియరెన్స్, ఇంటర్వెల్ కొండారెడ్డి బురుజు ఫైట్, ట్రెయిన్ కామెడీ, ఆర్మీ ఆపరేషన్, నల్లమల ఫైట్, సోల్జర్ సాంగ్, మైండ్ బ్లాక్ సాంగ్.

మైనస్ : బలహీనంగా మారిన ఎక్స్ టెండెడ్ క్లైమాక్స్, సెకండాఫ్ లో ఒకట్రెండు ఆగడు తరహా సీన్స్.

ఫస్టాఫ్ అంత బలంగా ఉన్నప్పుడు.. సెకండాఫ్ ను మరెంతో బాగా రాసుకునే వీలున్నా.. ముందే పెట్టుకున్న రిలీజ్ డెడ్ లైన్ తో రాజీపడ్డారేమో అనిపిస్తుంది. కొన్ని ఎలివేషన్స్ సీన్స్.. మిగతా వాటిని కవర్ చేస్తాయని సర్దుకుపోయి ఉంటారు. సెకండాఫ్ కూడా అదే రేంజ్ లో పడి ఉంటే… మూవీ రేంజ్ అంచనాలను మించిన స్థాయిలో ఉండేది.

పంచ్ లైన్ : సూపర్ బిఫోర్… యావరేజ్ ఆఫ్టర్..! ఓవరాల్ గా హిట్టు బొమ్మ.

(Visited 246 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *