బుడ్డోడు.. ఇంత లేడు కానీ.. ఎంత మెసేజ్ ఇచ్చాడు..!!!

Love-U-Boy
Spread the love

ఓ బుడ్డోడు.. రోడ్డు వెంట వెళ్తున్నాడు. వాళ్లమ్మ అతడిని ఫోన్ లో వీడియో తీస్తోంది. ఆ బుడ్డోడు సడెన్ గా ఆగిపోయాడు. కిందకు వంగాడు. అక్కడున్న దాన్ని తీసి.. పక్కనే కారులో ఉన్నవాళ్లకు ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ చిన్నపిల్లోడు చేసింది మామూలు పనికాదుగా మరి.  రోడ్డుపై తన దారిన తాను వెళ్తుంటే… రోడ్డుపై కనిపించిన ప్లాస్టిక్ బాటిల్ ను చూసి ఆగాడు. ఆ పక్కనే ఓ కారు ఆగి ఉంది. విండో సీట్ దగ్గర  ఓ లేడీ కూర్చొని ఉంది. ఆమెను పిలిచి… తీసుకోండి అంటూ తన సైగల భాషలో చెప్పి ఇచ్చేశాడు.  వెనకాలే వస్తూ వీడియో తీస్తుండటంతో..బుడ్డోడు చేసిన మంచి పని ఇపుడు శెభాష్ అనిపిస్తోంది.

చైనాలో జరిగిందీ సంఘటన. తన కొడుకు నడక ఈమధ్యే నేర్చుకున్నాడనీ.. ఎక్కడకు నడుచుకుంటూ వెళ్తున్నా.. వీడియో తీస్తున్నానని.. ఇది యాక్సిడెంటల్ గా రికార్డ్ అయిందని ఆ తల్లి చెప్పింది. బాయ్ చేతినుంచి బాటిల్ అందుకున్న ఆమె .. జన్మలో ఇంత నిర్లక్ష్యంగా ఉండనని చెప్పింది.

ప్లాస్టిక్ వస్తువులు ప్రపంచాన్ని కప్పేస్తూ..  వాతావరణ పరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్న తాజా పరిస్థితుల్లో ఈ వీడియో ఇచ్చే మెసేజ్ ఎంతో గొప్పది. అందుకే బుడ్డోడి వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్నపిల్లాడికి ఉన్నంత తెలివి.. పెద్దవాళ్లకు ఎందుకు ఉండదు అని అందరూ అంటున్నారు. పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలంటున్నారు.

చెప్పేందుకే నీతులు అంటారు. కానీ.. ఆచరించలేకపోతే ఇబ్బందులు తప్పవు. మనుగడకే కష్టమయ్యే పరిస్థితి వస్తుంది.

 

https://www.youtube.com/watch?v=HaSE4seXYhE

(Visited 163 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *