AP and Telangana Corona

మీ జిల్లా ఏ జోన్ లో ఉందో తెల్సుకోండి

జిల్లాల్లో కేసుల తీవ్రత… వైరస్ వ్యాప్తి ఆధారంగా..  దేశమంతటా జోన్లను ప్రకటించింది కేంద్రం. రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా వాటిని విభజించింది. రెడ్‌ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్‌ జోన్‌ లో 284, గ్రీన్‌ జోన్‌ లో 319 జిల్లాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్లుగానే ఉన్నాయి. వాటిలోనే జనాభా ఎక్కువ కాబట్టి.. కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లో 14, తమిళనాడు లో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి.  రెడ్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

తెలంగాణలోని జోన్ల వివరాలు

తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో 18 జిల్లాలో ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.

రెడ్ జోన్ 6 జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్.

ఆరెంజ్ జోన్ 18 జిల్లాలు: నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట,
మంచిర్యాల.

గ్రీన్ జోన్ 9 జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి

ఆంధ్రప్రదేశ్ జోన్ల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాలు రెడ్ జోన్ లో, 7 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో, 1 జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

రెడ్‌జోన్‌ 5 జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ

గ్రీన్‌ జోన్‌ జిల్లా: విజయనగరం

(Visited 90 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *