Rosaiah – CM KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (88) మరణం పట్ల సీఎం కేసీఆర్(CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రోశయ్య నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది.
రోశయ్య పార్థివ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
(Visited 92 times, 1 visits today)