ఎవలు రమ్మన్నారు కొడుకా.. పాట పూర్తి లిరిక్స్ : Exclusive

Evalu Rammannaru Koduka Song Charan Arjun Kamalavva Hyderabad Song
Spread the love

చరణ్ అర్జున్, కమలవ్వ కలిసి పాడిన ఎవలు రమ్మన్నారు కొడుకా పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది.. ఎన్ని వ్యూస్ వచ్చాయన్నది కాదు.. ఎంతోమందికి ఈ పాట వినగానే నచ్చుతోంది. విన్నవాళ్లు మళ్లీ మళ్లీ వింటున్నారు. ఈ పాటలో తమ బతుకును చూసుకుంటున్నారు. చదువుకుని.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన జనం.. ఇపుడు కరోనా టైమ్ లో.. ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంలో.. హైదరాబాద్ ఏమనుకుంటోంది.. అన్నదాన్ని పాటరూపంలో వినిపించి ఆకట్టుకున్నారు. ఆ పాటలోని సాహిత్యం KekaNews వెబ్ సైట్ రీడర్స్ కోసం ప్రత్యేకం.

ఎవలు రమ్మన్నారు కొడుకా

మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా

ఎందుకొచ్చినారు బిడ్డా.. ఎందుకు ఇడిసెల్లిపోతున్రు బిడ్డా..

దునియా మొత్తం రాని నన్ను.. దొరసాని అన్నారు కొడుకా..

దూరదూరం నుండి వచ్చీ..  నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా..

మీ బతుకుదెరువుకు.. మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే

పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి సెట్టంత ఎదిగారే..

కులము తలము లేదు.. వేషభాషలు లేవు అందరినీ మోసిందే

గడప తొక్కినోళ్ల కడుపునిండాపెట్టి.. అమ్మల్లే చూసిందే

నన్ను భాగ్య నగరమన్న మీరే.. అభాగ్యురాలు చేసినారె

ఎన్ని చూశాను నేను గాయాలే.. ఇంత వలపోత నాకెప్పుడు రాలె

కడమీన భాగ్యాన్ని నేను.. మట్టిలోనుండి పుట్టుకొచ్చాను

ఓమారాజు మోగించె నన్ను.. భాగ్యనగరంగ ఎలగొల్లినాను

అన్నిదిక్కుల నుండి మీరు.. అన్నమంటు నాకాడికొచ్చినారు

కన్నతల్లి ఓలె నేను.. కడుపులో పెట్టి సూసుకున్నాను

గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చారే

కొండంత అండై.. ఎండల్లో వానల్లో గొడుగల్లె కాసిందే..

మీ ఖాళీ జేబులకు .. మీ గాలి మేడలకు రాదారి చూపిందే

వెదురల్లె కదిలొచ్చి.. వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే..

తల్లి గుణము నాది కొడుకా.. నీ మేలు తప్ప కీడు తలువా..

ఎవడు చేసిన పాపపుణ్యం.. నేను అయిపోయినా ఇపుడు కొదువ

రాష్ట్రాలుగా వేరు అయినా .. ఈడనే ఉన్నారు నన్నొదలలేక

రాయకీయం చిత్రసీమ.. మీడియా అందరికీ ఇచ్చాను నీడ

ఖండఖండాలుగా కోసి.. నాతో చేశారు రియల్ దందాలు

పరదేశ మోజుల్లో మునిగి.. పాడు చేశారు పాతమూలాలు

అక్కర దీరాక పక్కన ఇసిరేసి ఎక్కడికో పోతే..

పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు

ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగరత వీలున లేకుండా

నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి నిలుచున్న వృక్షాలు

పల్లె ఇడిసి మీరు వత్తే.. అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో..

ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్ను.. గుండె చెరువైపోతుంది బిడ్డా..

పాట సాహిత్యం వింటేనే గుండె బరువెక్కుతుంది. ఈ పాటకు పదేపదే వినాలపించేలా ట్యూన్ చేశాడు చరణ్ అర్జున్. కమలవ్వతో కలిసి పాడి.. మరిచిపోలేని.. ఎమోషనల్ సాంగ్ ను అందించాడు. ఈ పాటను అందించిన చరణ్ అర్జున్, కమలవ్వలకు కేకన్యూస్ వందనం.

ఈపాట వింటూ.. తెలుగు రాష్ట్రాల అభిమానులు, హైదరాబాద్ కు ఊళ్లనుంచి వచ్చిన వాళ్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో షేర్ చేసుకుంటున్నారు. కొందరి మాటలు వింటుంటే.. ఎంతగా ఈ పాట వారిని ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. అందులో కొన్ని కామెంట్లు ఇక్కడ ఇస్తున్నాం. మీరూ చదవండి.

 

అన్నా…. నువ్వు అవకాశం ఇస్తే ఒక్కసారి నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలనుంది.. నిన్ను ఎలా పొగడాలో కూడా అర్ధం కావడం లేదు.. “చరణ్ అన్నా”… నువ్వు గాని నా ఈ కామెంట్ చుస్తే…. ఒక్కసారి నిన్ను చూసే అవకాశం కల్పించు….. నిన్ను కలిసే ఆ క్షణం కోసం.. ఎన్ని యుగాలు గడిచినా ఎదురుచూస్తూ ఉంటా అన్నా..

 

బహుశా హైదరాబాద్ కి మాటలు వస్తే మీ పాట రూపం లో చెప్పుకుంటుందేమో. అన్న ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగాటం.లేదు

 

చరణ్ అన్న నోట వింటే ఈ పాట.. జాలు వారే నా కంట.. కన్నీళ్ళ పంట.. కనకవ్వ గాత్రం.. వినాలని నా మనసులో ఆత్రం.. విన్నాక మాత్రం.. కన్నీరు విడిచే నా నేత్రం

 

అన్న పల్లె అందాలను వర్ణించిన కవులను ఎందరినో చూసిన కానీ పట్నం ( సిటీ) గురించి ఎంత బాగా రాసారు అన్న నిజం గా మాటలు లేవు🙏🙏, నాకు సిటీ అంటే అస్సలు నచ్చదు కానీ మీ పాట నన్ను ఆలోజింప చేసింది , నిజంగా ఎంత పొట్ట చేత పట్టుక పోయినోళ్ళకు ముడుపుటల బువ్వ పెడుతుంది , ఖచ్చితంగా మాట్లాడాలి అంటే పల్లె తల్లి మోయలేని భారాన్ని పట్నం మొస్తుంది

 

ఒక్క పాటతో.. వలస కూలీల బాధలు.. ఆదేశ్ రవి.. ఎలా కళ్లకు కట్టిండో… ఇప్పుడు చరణ్ అర్జున్ కూడా.. హైదరాబాద్ వ్యధను.. గుండెలను తాకేలా చేసిండు..

 

కనకవ్వ నీకు దండమే… నీనోటి నుండి వచ్చే ప్రతి పదం, పాట …నా గుండెల్లో కన్నీరు అవుతుంది……great song…tq gmc team

 

20 సంవత్సరాలు అవుతూంది హైదరాబాద్ వచ్హి ఇప్పుడున్న పరిస్తితి లొ మా ఊరికి పోయి వేరే పని చేయలేక ఇక్కడి నుండి వెళ్ళలేక పోతున్న. ఇ పాట వింటూంటే ఏడుపు వస్తుంది

చరణ్ అర్జున్ అన్న నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక ప్రజాచైతన్యం….

Very emotional … Lyrics clearly explains the people’s love for hyd and vice versa…

 

It’s really heart touching song but if we want live we have to this

(Visited 1,399 times, 1 visits today)
Author: kekanews