ఏపీలో కులపిచ్చికి ఆ జిల్లాలు కేరాఫ్..!

Godavari Districts
Spread the love

(ఇది ఆ జిల్లాల్లోని అందరికీ వర్తించదు. కానీ.. ఎక్కువమంది వ్యవహార శైలివల్లే ఆ జిల్లాలకు ఈ పేరు వచ్చింది.)

స్టేషనులో దళితుల శిరోముండనం..
స్టేషను బైట దళితమహిళ రేప్..
మామిడికాయల దొంగ అంటూ బిక్కిశ్రీను హత్య..
ఇసకమాఫియా చేతిలో దళితుల హత్య..

గోదావరి జిల్లాల అంత కులపిచ్చి జిల్లా
అత్యంత అనాగరిక జిల్లా
ఆటవిక సంస్కృతి గల జిల్లా
నేను చూడలేదు
మర్యాదల జిల్లా అనేదంతా అబద్ధం
తడిగుడ్డలతో గొంతులు కోసే కల్చర్ అక్కడిదే

కులం చెప్పనిదే కుశలం అడగని
ఇరుకు మనసుల జిల్లా అది
వారి చదువంతా కులరక్కసి
మడతల్లో ఎప్పుడో ఇరుక్కుపోయి
ఊపిరాడక చచ్చిపోయింది.

అత్యంత రుచిగల స్వీట్లనూ,
భోజనాలను రుచిచూస్తూ
పసలేని పనులకూ వారు ఫేమస్
ఎన్ని స్వీట్లు చేస్తే ఏంటీ
ఇంచిత్ మానవత్వం నీలో లేనపుడు
గోదావరి జిల్లా అని పేరు మానేసి
కుల కుంపట్ల జిల్లాగా మార్చండి
దళితుల మీద దయలేని జిల్లా
ఉంటేనేమి పోతేనేమి

అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా అంటే
పొలాల రేట్లలో కాదు కులాల పట్లలో చూపండి
తియ్యటి పదార్ధాల తయారీలో కాదు
తియ్యని మనసులని తయారుచేయండి
కమ్మనిభోజనాలలో కాదు
కల్మషంలేని బంధాలలో చూపండి
ఆధిపత్య కులాలు అంటే
అణచడంలో కాదు
అక్కున చేర్చుకోవడంలో చూపండి
వనరుల దోపిడీలో కాదు
ప్రకృతి పరిరక్షణలో చూపండి

వేల ఏళ్ళ ఆదికవిత అక్కడిదే
వేల ఏళ్ల అంటరానితనం కూడా అక్కడిదే
చరిత్రా అక్కడిదే…కుటిలచరిత్రా అక్కడిదే
కందుకూరి గురజాడ డొక్కాసీతమ్మ
చరిత్రలో కలిసిపోయారు
వారు మరలా అక్కడ జన్మించనేలేదు
వారికి బదులు కసబ్ గాడ్సే శోభరాజ్
వారసులంతా ఆధార్ కార్డులతో
ఇసుకనీ మట్టినీ నీటినీ టోకుగా
అమ్ముకునే నయా భూబకాసురుల రూపంలొ
వేలవేల గుళ్ళలో కొలువైనారు.
ఇకనైనా మారండి…మనుషులుగా బతకండి
Vijay Mohan

(షేర్ కోసం పర్మిషన్ అడగొద్దు…విచ్చలవిడిగా చేసుకోవచ్చు….ఆ జిల్లా మీద ప్రేమ ఎక్కువై ఆ మనుషుల మీద బాధతో రాసాను..మన్నించగలరు)

(Visited 97 times, 1 visits today)
Author: kekanews