OnePlusNord రిలీజ్డ్.. కాస్ట్, డీటెయిల్స్ ఇవిగో..

ONE PLUS NORD MODEL RELEASE PRICE KEY FEATURES ARE THESE
Spread the love

ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వన్ ప్లస్ నార్డ్ మోడల్ రిలీజైంది. బడ్జెట్ లో ఈ మొబైల్ ను తీసుకొస్తున్నామని వన్ ప్లస్ చెబుతూ వస్తోంది. ఐతే…బేస్ వేరియంట్ ధర 6జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్ వేరియంట్ ను రూ.24వేల, 999కు తీసుకొస్తోంది. ఈ మోడల్ సెప్టెంబర్ లో రానుంది.

ఐతే… 8జీబీ/128 జీబీ … 12 జీబీ /256 జీబీ మోడల్స్ ను ఆగస్ట్ 4న అమేజాన్ లో సేల్ కు తీసుకొస్తోంది. 8జీబీ వేరియంట్ ధర రూ.27వేల 999 గా నిర్ణయించింది. 12జీబీ వేరియంట్ ధర రూ.29వేల 999గా డిసైడ్ చేసింది.

బడ్జెట్ మొబైల్ అనగానే అందరూ 25వేలు ఊహించారు. ఐతే.. 20వేలకే వస్తోందని ఈ ఉదయం నుంచి న్యూస్ బయటకి వచ్చింది. ఐతే.. వన్ ప్లస్ టీవీల్లో బేసిక్ టీవీని 13వేలకే ప్రకటించిన వన్ ప్లస్.. ఈ 5జీ మిడ్ రేంజ్ ఫోన్ రేట్ ను మాత్రం ఎక్కువే పెట్టింది.

ఐతే.. వన్ ప్లస్.. ఈ సెగ్మెంట్ లోనూ… ఫీచర్స్ పరంగా.. టెంప్ట్ చేస్తోందనే చెప్పాలి.

కీ ఫీచర్స్ ఇవే…

  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్
  • రామ్/మెమరీ డీటెయిల్స్.. 6జీబీ/64జీబీ… 8జీబీ/128జీబీ, 12 జీబీ/256జీబీ వేరియంట్లు
  • రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్..
  • విత్ 48మెగాపిక్సెల్ సోనీ లెన్స్..
  • 48ఎంపీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 5ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మైక్రో కెమెరా
  • డ్యూయల్ సెల్ఫీ కెమెరా
  • 32 మెగాపిక్సెల్ సోనీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్
  • నైట్ స్కేప్ మోడ్ కెమెరా
  • చేతులు షేక్ అవుతున్నా 4కే వీడియోలను స్టెడీగా తీయొచ్చు
  • బ్యాటరీ 4150mAh.. 30 నిమిషాల్లో హాఫ్ బ్యాటరీని చార్జ్ చేస్తుంది.
  • 30టీవార్ప్ చార్జ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఆక్సిజన్ ఓఎస్ 10.ఓ
  • ఫాస్టెస్ట్ అండ్ సూతెస్ట్ ఎక్స్ పీరియన్స్
  • 5G రెడీ టెక్నాలజీ
  • 90Hz AMOLED డిస్ ప్లే
(Visited 168 times, 1 visits today)
Author: kekanews