లవణం, విజయం, నియంత.. డా.సమరం కుటుంబసభ్యుల పేర్లు ఇవీ

doctor samaram
Spread the love

డాక్టర్ సమరం. అందరికీ తెలిసిన పాపులర్ సెక్సాలజిస్ట్ ఆయన. సలహాలు, సూచనలతో ఎంతోమంది సందేహాలు తీర్చిన ఫ్రెండ్ ఆయన. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా డాక్టర్ సమరం చెప్పిన కేక పెట్టించే ఆసక్తికరమైన సంగతులు తెల్సుకుందాం.

డాక్టర్ సమరం తండ్రి ఫ్రీడమ్ ఫైటర్ గోరాజు రామచంద్రరావు అలియాస్ గోరా. కులం, మతంపై పోరాడారు. ఓ పత్రికలో దేవుడు లేడు అనే వ్యాసం రాసినందుకు ఆయన్ను అధ్యాపక వృత్తి నుంచి తొలగించారు.

డాక్టర్ సమరం తోబుట్టువులందరి పేర్లు కులం, మతం సూచించకూడదని వాళ్ల నాన్న అనుకున్నారు. అందుకే వాళ్లింట్లో పేర్లు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సమరం అన్న పేరు ఎలా పెట్టారన్నది ఆసక్తికరమైన అంశం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డాక్టర్ సమరం పుట్టారు. వాళ్ల నాన్న అప్పుడే ఆయనకు సమరం అనే పేరు పెట్టారు. ఇదేకాదు.. సమరం తోబుట్టువులందరికీ .. వాళ్ల నాన్న ఇలాంటి కులం,మతం అంటుకోని పేర్లు పెట్టారు.

పెద్దక్కయ్యకి మనోరమ, ఉప్పుసత్యాగ్రహం టైమ్ లో పుట్టిన అన్నయ్యకి లవణం అని నామకరణం చేశారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగినప్పుడు పుట్టిన అమ్మాయికి మైత్రి, చదువుపై మమకారంతో ఇంకో అక్కయ్యకి విద్య, గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రస్ విజయం సాధించినప్పుడు పుట్టిన అక్కయ్యకు విజయ అని పేర్లు పెట్టారు. హిట్లర్, స్టాలిన్, ముస్సోలినీలల ప్రేరణతో తమ్ముడికి నియంత అని పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చేముందు పుట్టిన చెల్లికి మార్పు అని పేరు పెట్టారు.

మా తండ్రి పోకడలు నచ్చకపోవడంతో..చాలామంది మా కుటుంబాన్ని సమాజం నుంచి వెలేశారు.

(Visited 290 times, 1 visits today)
Author: kekanews