ఫీజు రూ.2.. వందలమందికి గుండె ఆపరేషన్లు.. డా.సమరం ఈజ్ గ్రేట్

doctor samaram
Spread the love

డాక్టర్ సమరం. అందరికీ తెలిసిన పాపులర్ సెక్సాలజిస్ట్ ఆయన. సలహాలు, సూచనలతో ఎంతోమంది సందేహాలు తీర్చిన ఫ్రెండ్ ఆయన. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా డాక్టర్ సమరం చెప్పిన కేక పెట్టించే ఆసక్తికరమైన సంగతులు తెల్సుకుందాం.

డాక్టర్ సమరం నాస్తికుడు. దాడులు జరిగినా భయపడకుండా తాను నమ్మని నమ్మకాలపై యుద్ధం చేస్తున్నారు.

80 ఏళ్ల వయసులోనూ డాక్టర్ సమరం రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు.

డాక్టర్ సమరం తండ్రి ఫ్రీడమ్ ఫైటర్ గోరాజు రామచంద్రరావు అలియాస్ గోరా. ఓ పత్రికలో దేవుడు లేడు అనే వ్యాసం రాసినందుకు ఆయన్ను అధ్యాపక వృత్తి నుంచి తొలగించారు.

డాక్టర్ సమరం తోబుట్టువులందరి పేర్లు కులం, మతం సూచించకూడదని వాళ్ల నాన్న అనుకున్నారు. అందుకే వాళ్లింట్లో పేర్లు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సమరం అన్న పేరు ఎలా పెట్టారన్నది ఆసక్తికరమైన అంశం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డాక్టర్ సమరం పుట్టారు. వాళ్ల నాన్న అప్పుడే ఆయనకు సమరం అనే పేరు పెట్టారు. ఇదేకాదు.. సమరం తోబుట్టువులందరికీ .. వాళ్ల నాన్న ఇలాంటి కులం,మతం అంటుకోని పేర్లు పెట్టారు.

పెద్దక్కయ్యకి మనోరమ, ఉప్పుసత్యాగ్రహం టైమ్ లో పుట్టిన అన్నయ్యకి లవణం అని నామకరణం చేశారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగినప్పుడు పుట్టిన అమ్మాయికి మైత్రి, చదువుపై మమకారంతో ఇంకో అక్కయ్యకి విద్య, గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రస్ విజయం సాధించినప్పుడు పుట్టిన అక్కయ్యకు విజయ అని పేర్లు పెట్టారు. హిట్లర్, స్టాలిన్, ముస్సోలినీలల ప్రేరణతో తమ్ముడికి నియంత అని పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చేముందు పుట్టిన చెల్లికి మార్పు అని పేరు పెట్టారు.

మా తండ్రి పోకడలు నచ్చకపోవడంతో..చాలామంది మా కుటుంబాన్ని సమాజం నుంచి వెలేశారు.

కుటుంబం గడవడానికి ఓ చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాళ్లం.

మెట్రిక్యులేషన్ ప్రైవేటుగా రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. విజయవాడ లయోలా కాలేజీలో అప్లికేషన్ చేస్తే కులం, మతం లేదని సీటివ్వలేదు. ఈ విషయం అసెంబ్లీ దాకా వెళ్లింది. ఐనా చదువు కొనసాగించాను. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో చేరి మెడిసిన్ పూర్తిచేశాను. విదేశాలకు వెళ్తే పేదలకు సాయం చేయలేనని ఆగిపోయాను.

బెజవాడ పటమటలో 1972లో ప్రాక్టీస్ మొదలుపెట్టా. రెండు రూపాయల ఫీజు తీసుకునేవాణ్ని.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాక.. నాకున్న పరిచయాలతో స్పెషలిస్టులను తీసుకెళ్లి చుట్టుపక్కల ఊళ్లలోని పేదలకు ఆపరేషన్లు, వైద్యం చేయించా. 2వందల మందికి గుండె ఆపరేషన్లు చేయించా.

మెడిసిన్ చదువుతున్నప్పుడే ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని అర్థమైంది.

నేను ఓ ఛానెళ్లో అప్పట్లో శనివారం రాత్రివేళ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తే.. సెకండ్ షో థియేటర్లు ఖాళీగా ఉండేవి. ఎవరికీ చెప్పరు గానీ.. సెక్స్ సందేహాలు, విషయాలు తెల్సుకోవాలన్న కుతూహలం అందరిలో ఉంటుంది.

సెక్స్ డాక్టర్ అని ఎవరూ చులకనగా చూడరు. దానివల్లే నా గౌరవం పెరిగింది.

స్మార్ట్ ఫోన్లు చేతికొచ్చాయి కాబట్టే రేప్ లు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయనడం కరెక్ట్ కాదు. జనం పెరుగుతున్నారు. కానీ.. వారికి కావాల్సిన సెక్స్ ఎడ్యుకేషన్ అందడం లేదు. పోర్న్ సైట్లను నిషేధించాలనడం కరెక్ట్ కాదు. సామాన్యులకు సెక్స్ విద్య పట్ల అవగాహన కల్పించాలి. అదో రహస్యంగా ఉంచడం వల్లే.. అందులో ఏముందో తెల్సుకోవాలన్న కుతూహలంతో నేరాలకు పాల్పడుతున్నారు.

బాణామతి, చేతబడి లాంటి మూఢనమ్మకాలపై మెదక్ జిల్లాలో నాగరాజు అనే హిప్నాటిస్ట్ తో అవగాహన ప్రోగ్రామ్ చేశాం. కొందరు తిరగబడి దాడి చేశారు. పోలీసులు రాకపోయి ఉంటే.. ఈ సమరం బతికేవాడు కాదు.

 

 

(Visited 426 times, 1 visits today)
Author: kekanews