ఓ కసక్.. ఓ ఫసక్.. బిగ్ బాస్ లో తెలంగాణ కత్తులు

హైట్ చిన్నదే అయినా.. ఆమె చూపులో ఉన్నంత చురుకు.. మేని అందంలోనూ ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన ఔట్ ఫిట్ తో ఓ ముద్రేసిపోయింది. దేత్తడి పోషమ్మగుడి… ఏదైతే అదైంది..

Dethadi Harika Jordar Teenmar Sujatha

బిగ్ బాస్ 4 నిర్వాహకుల బ్రెయిన్ కు దండం పెట్టాల్సిందే. రేటింగ్ లెక్కలన్నీ చూసుకుని కంటెస్టెంట్స్ ను ఎంచుకోవడంలో వీళ్ల ప్రయారిటీలను మెచ్చుకోవాల్సిందే.

ప్రోగ్రామ్ తెలుగులో. చూసేది తెలుగు ప్రేక్షకులు. రెండు రాష్ట్రాల్లో ఫుల్లు జనాలు. పొరుగు రాష్ట్రాల్లోను మనోళ్లు. భిన్న మనస్తత్వాలు. భిన్న మతాలు. రకరకాల ఏజ్ గ్రూప్ లు.

డాన్సులు చేయాలి.. స్టైల్ గా ఉండాలి.. ఏడ్వాలి.. నవ్వించాలి… ఎక్స్ పోజ్ చేయాలి.. అందంతో కవ్వించాలి.. ఒకరు దూకుడుగా ఉండాలి.. ఇంకొకరు మందలిస్తూ నచ్చజెప్పాలి.. ఇలా.. 16 మందినీ ఒక్కొక్కరినీ ఒక్కో స్టైల్ లో తీసుకుంటుంటారు. అలా.. తెలంగాణ నుంచి ఎన్నుకున్న ఇద్దరు కత్తుల్లాంటి ఆడపిల్లల గురించి ఈ పోస్టులో డిస్కస్ చేసుకుందాం.

శృతి అలియాస్ తీన్మార్ సుజాత్ అలియాస్.. జోర్దార్ సుజాత. చలాకీతనం ఉన్న పక్కా తెలంగాణ పల్లెటూరి పిల్ల శృతి. మాటల పిడుగు ఈమె. మాట్లాడుతుంటే పరమ గయ్యాలిదిరా అనిపిస్తుంది కానీ.. అది టీవీల ముందే. ఈమెకు బరువైన గతం ఉందని ఇంట్రోలో చెప్పింది. మున్ముందు మరింతగా ఎపిసోడ్లుగా మన ముందుకు రానుంది ఈమె గతం. ఫస్ట్ ఎపిసోడ్ లోనే.. తీరైన చీరకట్టులో ఆకట్టుకుంది సుజాత. నిండుదనం ఉన్న తెలంగాణ అమ్మాయి.. సినిమా హీరోలంటే ఎలా పడి చస్తారో ఒక్క మాటలో చెప్పేసింది. నాగార్జునను బిట్టు అంటూ మనం సినిమాలో క్యారెక్టర్ ను గుర్తుచేస్తూ.. తన ఓన్ చేసుకుని సంబరపడింది. సుజాత అన్నిరకాలుగా ఆకట్టుకుంది. మిగతా క్యారెక్టర్లను రఫ్ఫాడించి ఫసక్ చేసేందుకు రెడీ అయిపోయింది.

దేత్తడి హారిక. ముట్టుకుంటే కసక్ మని తెగిపోవాల్సిందే. అంత వాడిగా ఉన్న మెంటాలిటీ ఈ అమ్మాయిది. బోల్డ్ అండ్ బ్యూటీనెస్ ఓవర్ లోడెడ్. తప్పు చేసినా కవర్ చేసుకునే రకం. పరిస్థితులను ఎలాగోలా తనకు అనుకూలంగా మల్చుకునే టైపు. హైట్ చిన్నదే అయినా.. ఆమె చూపులో ఉన్నంత చురుకు.. మేని అందంలోనూ ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన ఔట్ ఫిట్ తో ఓ ముద్రేసిపోయింది. దేత్తడి పోషమ్మగుడి… ఏదైతే అదైంది.. స్క్రీన్ పై హారిక కనిపిస్తే కళ్లప్పగించి చూసే కుర్రకారు మాత్రం పెరిగిపోయారనడంలో డౌటేంలేదు.

మిగతా కంటెస్టెంట్స్ గురించి వారి ప్రొఫైల్ చూస్తే ఎంపిక ఎలా జరిగిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదీ బిగ్ బాస్ లో తెలంగాణ కసక్, ఫసక్ ల గురించి షార్ట్ డిస్కషన్.

(Visited 197 times, 6 visits today)

Next Post

నాలుగోస్థంభానికి చెదలు పట్టింది.. ఇదీ నేటి మీడియా

Wed Sep 16 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/dethadi-harika-jordar-teenmar-sujatha-in-bigg-boss-telugu-4/"></div>ఇది నేటి మీడియా ఉత్తుత్తి మాటలను ఉద్యమాలుగా మార్చగలదు ఉద్యమాలను ఉధృతం చేయగలదు ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్లుగా చూపించగలదు అనవసరమైన విషయాలను ఆకాశానికి ఎత్తేయగలదు అవసరమైన విషయాలను అంధకారంలో దాచగలదు రౌడీలను హీరోలను చేయగలదు హీరోలను బికారీలను చేయగలదు బలవంతున్ని అతి బలవతుండిగా చేయగలదు …… బలహీనున్ని చేయగలదు బలహీనునికి బతుకే లేకుండా చేయగలదు మోసం నుంచి పుట్టిన ఐడియానే ఈ మీడియా ప్రజల పక్షమని గొప్పలు చెప్పుకుంటుంది ప్రజలే […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/dethadi-harika-jordar-teenmar-sujatha-in-bigg-boss-telugu-4/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..