ఓ కసక్.. ఓ ఫసక్.. బిగ్ బాస్ లో తెలంగాణ కత్తులు

Dethadi Harika Jordar Teenmar Sujatha
Spread the love

బిగ్ బాస్ 4 నిర్వాహకుల బ్రెయిన్ కు దండం పెట్టాల్సిందే. రేటింగ్ లెక్కలన్నీ చూసుకుని కంటెస్టెంట్స్ ను ఎంచుకోవడంలో వీళ్ల ప్రయారిటీలను మెచ్చుకోవాల్సిందే.

ప్రోగ్రామ్ తెలుగులో. చూసేది తెలుగు ప్రేక్షకులు. రెండు రాష్ట్రాల్లో ఫుల్లు జనాలు. పొరుగు రాష్ట్రాల్లోను మనోళ్లు. భిన్న మనస్తత్వాలు. భిన్న మతాలు. రకరకాల ఏజ్ గ్రూప్ లు.

డాన్సులు చేయాలి.. స్టైల్ గా ఉండాలి.. ఏడ్వాలి.. నవ్వించాలి… ఎక్స్ పోజ్ చేయాలి.. అందంతో కవ్వించాలి.. ఒకరు దూకుడుగా ఉండాలి.. ఇంకొకరు మందలిస్తూ నచ్చజెప్పాలి.. ఇలా.. 16 మందినీ ఒక్కొక్కరినీ ఒక్కో స్టైల్ లో తీసుకుంటుంటారు. అలా.. తెలంగాణ నుంచి ఎన్నుకున్న ఇద్దరు కత్తుల్లాంటి ఆడపిల్లల గురించి ఈ పోస్టులో డిస్కస్ చేసుకుందాం.

శృతి అలియాస్ తీన్మార్ సుజాత్ అలియాస్.. జోర్దార్ సుజాత. చలాకీతనం ఉన్న పక్కా తెలంగాణ పల్లెటూరి పిల్ల శృతి. మాటల పిడుగు ఈమె. మాట్లాడుతుంటే పరమ గయ్యాలిదిరా అనిపిస్తుంది కానీ.. అది టీవీల ముందే. ఈమెకు బరువైన గతం ఉందని ఇంట్రోలో చెప్పింది. మున్ముందు మరింతగా ఎపిసోడ్లుగా మన ముందుకు రానుంది ఈమె గతం. ఫస్ట్ ఎపిసోడ్ లోనే.. తీరైన చీరకట్టులో ఆకట్టుకుంది సుజాత. నిండుదనం ఉన్న తెలంగాణ అమ్మాయి.. సినిమా హీరోలంటే ఎలా పడి చస్తారో ఒక్క మాటలో చెప్పేసింది. నాగార్జునను బిట్టు అంటూ మనం సినిమాలో క్యారెక్టర్ ను గుర్తుచేస్తూ.. తన ఓన్ చేసుకుని సంబరపడింది. సుజాత అన్నిరకాలుగా ఆకట్టుకుంది. మిగతా క్యారెక్టర్లను రఫ్ఫాడించి ఫసక్ చేసేందుకు రెడీ అయిపోయింది.

దేత్తడి హారిక. ముట్టుకుంటే కసక్ మని తెగిపోవాల్సిందే. అంత వాడిగా ఉన్న మెంటాలిటీ ఈ అమ్మాయిది. బోల్డ్ అండ్ బ్యూటీనెస్ ఓవర్ లోడెడ్. తప్పు చేసినా కవర్ చేసుకునే రకం. పరిస్థితులను ఎలాగోలా తనకు అనుకూలంగా మల్చుకునే టైపు. హైట్ చిన్నదే అయినా.. ఆమె చూపులో ఉన్నంత చురుకు.. మేని అందంలోనూ ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే తన ఔట్ ఫిట్ తో ఓ ముద్రేసిపోయింది. దేత్తడి పోషమ్మగుడి… ఏదైతే అదైంది.. స్క్రీన్ పై హారిక కనిపిస్తే కళ్లప్పగించి చూసే కుర్రకారు మాత్రం పెరిగిపోయారనడంలో డౌటేంలేదు.

మిగతా కంటెస్టెంట్స్ గురించి వారి ప్రొఫైల్ చూస్తే ఎంపిక ఎలా జరిగిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదీ బిగ్ బాస్ లో తెలంగాణ కసక్, ఫసక్ ల గురించి షార్ట్ డిస్కషన్.

(Visited 618 times, 1 visits today)
Author: kekanews