బిత్తిరి సత్తి కెరీర్ ఫసక్.. అదొక్కటే ఆశ..!

సత్తి సోలోగా 15 నిమిషాలు కష్టపడి.. 5 నిమిషాల స్కిట్ కనిపిస్తే.. చాలు.. బోలెడన్ని డబ్బులు జేబులో వచ్చిపడేవి. కానీ.. ఇపుడు సీన్ మారిపోయింది. 

Bithiri Career

తెలుగు టీవీ తెరపై బిత్తిరిసత్తికి వచ్చిన పాపులారిటీ మరే క్యారెక్టర్ కు దక్కలేదు. మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి పొలిటికల్ గా, సోషల్ గా సెటైర్ వేస్తే దానికి ఉండే వాల్యూనే వేరు. అందుకే.. బుల్లెట్ వేగంతో.. బిత్తిరి సత్తి క్యారెక్టర్ జనంలోకి వెళ్లింది. వీ6, టీవీ9 ప్రస్థానాలు ముగిశాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్తుంది.. ఏం చేస్తుంది.. అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

వేరే ఛానెల్.. ఛాన్సేలేదు..?!

భారీ జీతం.. భారీ వేదిక.. ఈ రెండు ఇపుడు సత్తిని మిస్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో మరే ఛానెల్ కూడా సత్తిని తీసుకునే సాహసం చేయకపోవచ్చు. బిత్తిరిని తీసుకుంటే సరిపోదు.. దానికి సరిపోయే స్క్రిప్ట్ రాయగలిగే మరో రైటర్ కూడా కావాలి. కాబట్టి.. 1+1 ఆఫర్ ను కొనుక్కోగలిగే సాహసం.. ఈ కరోనా పరిస్థితుల్లో మరే ఛానెల్ చేయదనే అనుకుంటున్నారు.

ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇస్తూ.. కరోనాను ఈదగలిగితే చాలు అని టీవీ వార్తా సంస్థల యాజమాన్యాలు అనుకుంటున్నాయి. V6లోకి మళ్లీ వచ్చే అవకాశమే లేదు. ఇతర చానెల్స్ ఆయనతో వచ్చే ఆర్థిక బరువును మోసే పరిస్థితుల్లో లేవు. ఇపుడు సత్తి ముందు ఉన్న దారులేంటో చూద్దాం.

యూట్యూబ్.. చాలా కష్టం

సత్తి సోలోగా 15 నిమిషాలు కష్టపడి.. 5 నిమిషాల స్కిట్ కనిపిస్తే.. చాలు.. బోలెడన్ని డబ్బులు జేబులో వచ్చిపడేవి. కానీ.. ఇపుడు సీన్ మారిపోయింది. బిత్తిరి సత్తికి సొంత ప్లాట్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. కానీ.. యూట్యూబ్ ను నమ్ముకుంటే గొడ్డుచాకిరీ చేయాల్సిందే. కాబట్టి ఇది వర్కవుట్ అవుతుందన్న గ్యారంటీలేదు. ఐతే.. యూట్యూబ్ పై సత్తి ఎఫర్ట్ పెట్టే చాన్సుంది. దానికి ఆయన చేతుల్లోంచి మరిన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. తనను ఎక్స్ పోజ్, హైలైట్ చేయగలిగే రాతగాళ్లపై ఖర్చుచేయాల్సి ఉంటుంది.

బిగ్ బాస్… ఒక్కటే ఆశాదీపం

బిగ్ బాస్ రాబోయే సీజన్ లో బిత్తిరి సత్తి ఉంటాడనే చర్చ జరుగుతోంది. నిజంగా సత్తి అందులో సెలెక్ట్ అయితే… కమర్షియల్ గా  వర్కవుట్ అయ్యే చాన్సుంది. ఒకవేళ అలా జరక్కపోతే.. సత్తి జనంలో కనిపించడు కాబట్టి..పాపులారిటీ  తగ్గిపోవడం ఖాయం.

సినిమాలు

మామూలుగా సినిమాలకే ఇపుడు దిక్కులేదు. ఇక సత్తికి అవకాశాల సంగతి దేవుడెరుగు. ఒకవేళ సత్తి తనకు స్పేస్ దొరకబుచ్చుకుంటే మాత్రం అంతా హ్యాప్పీనే.

వ్యవసాయం

చేవెళ్లరవి శ్రామికుడు, రైతు. మట్టినుంచి వచ్చాడు. ఆయనకు కష్టం తెలుసు. ఇప్పటికీ ఫేస్ బుక్ లో వ్యవసాయంపనులు చేస్తూ తన అభిరుచిని చాటుకుంటుంటాడు. చెప్పలేం… తాను మొదలుపెట్టిన దగ్గరకే మళ్లీ వచ్చి మట్టిబిడ్డగా మారుతాడా అన్నది చూడాలి.

ఇపుడు బిత్తిరి సత్తి క్యారెక్టర్ ను చేవెళ్ల రవి ఎలా నిలబెట్టుకుంటాడు.. ఆయన కెరీర్ ఏ తీరం వైపుకు వెళ్తుందన్నది తెలుగువారిలో అతిపెద్ద చర్చనీయాంశం అయింది.

(Visited 249 times, 1 visits today)

Next Post

దాచుకోనంటున్న మరాఠీ మోడల్ .. ఫొటోగ్యాలరీ

Wed Jun 24 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/bithiri-sathi-career-may-ends/"></div>బాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య రేస్ మామూలుగా ఉండదు. అవకాశాల కోసం అక్కడ అందాల ఆరబోత తప్పదు. ఈ విషయంలో మన సౌతిండియా ఇండస్ట్రీలు కొంచెం బెటర్. ఇప్పటికే పలు యాడ్ ఫిలింలలో నటించిన హర్షదా విజయ్ తాజాగా చేసిన ఫొటోషూట్ ఇపుడు వైరల్ అవుతోంది. ఈమె మరాఠీ మోడల్. ముంబైలో పలు యాడ్ ఫిలింలలో నటించింది. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు మోడలింగ్ చేసిందంటే.. ఫిగర్ ఎంతబాగుంటుందో అర్థం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/bithiri-sathi-career-may-ends/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Harshada Vijay

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..