అయోధ్య రామ మందిర ఉద్యమం, చరిత్ర తెలుసుకోండి

Spread the love

“అయోధ్య” ఆలయం సుధ్రుడం

వందల సంవత్సరాల రామజన్మభూమి రణం అజరామరం. తరతరాల పోరాట ఫలమే నేడు అయోధ్యలో రామయ్యకు భవ్యమైన మందిర నిర్మాణం. 1526 సంవత్సరం నుంచి మొదలుకొని 2019 నవంబర్ 9న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పే దాకా సాగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో సువర్ణాధ్యాయం. వందల సంవత్సరాల నాటి దౌర్జన్య పు మరకలు చెరిపే పోరులో రక్తం చిందించి.. ప్రాణ త్యాగం చేసిన వీరులు ధన్యులు. రామశిల.. రామ జ్యోతి.. కరసేవ.. ఇలా వేర్వేరు పేర్లతో రామ భక్తులు, కరసేవకులు నాడు కర్తవ్యం నిర్వర్తించారు. అయోధ్యలో మొగలాయిలు దాడిచేసి ధ్వంసం చేసింది కేవలం రాముడు విగ్రహాలు,రామ మందిరం పై మాత్రమే కాదు.. సృష్టిలోని యావత్ హైందవ సమాజం స్వాభిమానం పైనే దాడి జరిగింది అనే భావనతో కులాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు తావులేకుండా భారతదేశంలోని పల్లె పల్లె నుంచి ప్రతి హిందువు ప్రాణాలకు లెక్కచేయకుండా అయోధ్య పోరులో శక్తిని ప్రదర్శించారు.

దాదాపు ఐదువందల సంవత్సరాల అవిశ్రాంత పోరాటం.. నాలుగున్నర లక్షల మంది కార్యకర్తల ప్రాణ త్యాగం తో పాటు కోట్లాది మంది హిందువులు విరోచిత పోరాట ఫలితంగానే ఈరోజు రాములవారి జన్మభూమి తిరిగి హైందవుల చేతికి చేరింది. కోట్లాది మంది తల్లిదండ్రుల కడుపుకోత. అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, ఆత్మీయులు, బంధుమిత్రుల ఆక్రందనలు.. కన్నీటి సంద్రం అయోధ్య ఉద్యమంలో సజీవ సాక్షాలు. హైందవ సమాజానికి ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడి జన్మ భూమి విషయంలో వందల సంవత్సరాలు రాజకీయ కుట్ర సాగింది. సాక్ష్యాలను తారుమారు చేసి, వాస్తవాలను తొక్కిపెట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి, హిందూ సమాజం పై గత పాలకుల విషపూరిత వివక్ష ప్రదర్శించారు. అన్ని రకాల పరిశోధనలు నిర్వహించి అది రాములవారి కి సంబంధించిన ఆలయమే అని పురావస్తు శాఖ అధికారులు నివేదికలు సమర్పించిన కూడా.. రాజకీయ పెద్దలు పెడచెవిన పెట్టారు. పర్యావరణం పేరుతో.. లౌకికవాదం పేరుతో హైందవ సమాజాన్ని అడుగడుగున అవమానిస్తూ వచ్చారు. సొంత దేశంలో మెజారిటీ ప్రజల ఆత్మవిశ్వాసం లకే విలువలు లేకుండా వ్యవహరించారు. లెక్కలేనన్ని అధికార దుర్వినియోగాలకు పాల్పడి రాములవారి మందిరాన్ని ముందుకు సాగనీయకుండా మరుగున పడేసిన చరిత్ర గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలాంటి అనేక దౌర్జన్యాలు దాడులను ఎదుర్కొని, తట్టుకొని ఆలయం కోసం శాంతియుతంగా ధర్మ మార్గంలో పోరాటం చేస్తూనే కర్తవ్య దీక్షలో వెన్ను చూపకుండా పోరాడిన చరిత్ర కరసేవకులది.
అయితే నాడు 1989, 1990 ,1992 సంవత్సరాలలో సాగిన అయోధ్య ఉద్యమాలు భారత చరిత్రలో కీలకం. ఈ ఉద్యమాలు జరిగిన సమయంలో చాలా మంది ఇంకా పుట్టలేదు. కాబట్టి చరిత్రపై పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం నేటి యువతరం పై ఉంది. ఎందుకంటే అయోధ్య ఉద్యమం అనేది ప్రపంచంలోనే చాలా సుదీర్ఘంగా నాలుగున్నర శతాబ్దాల పాటు న్యాయబద్ధంగా.. చట్టబద్ధంగా..ధర్మబద్ధంగా సాగిన పోరాటం. చివరకు ధర్మాన్ని నమ్ముకున్న కరసేవకులు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ద్వారానే విజయం సాధించడం విశేషం. మరి నాడు కరసేవ లో పాల్గొనేందుకు నేటి తరానికి అవకాశం రాలేదు కాబట్టి ప్రస్తుతం అయోధ్యలో నిర్మాణమవుతున్న రామమందిర నిర్మాణ యజ్ఞంలో పాల్గొని రాముల వారి సేవలు తరించాల్సిన అవసరం ఉంది. మందిర నిర్మాణానికి తమ వంతు శక్తిమేర ఆర్థిక సహాయం అందించి భక్తి చాటుకోవాలి.

వాస్తు ఉట్టిపడేలా ఆలయ స్వరూపం..

ప్రముఖమైన నాగరి నిర్మాణ శైలితో రెండు ఎకరాల విస్తీర్ణంలో మందిరం నిర్మాణం అవుతోంది. అష్టభుజి ఆకృతిలో గర్భగుడి ..చుట్టూ వృత్తాకారం పరిధి ఉంటుంది. మొదట అనుకున్న నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రెండంతస్తుల కు బదులు మూడు అంతస్తుల మందిరం నిర్మాణమవుతోంది. ఆలయం పొడవు 360(మూడు వందల అరవై) అడుగులు, వెడల్పు 230 అడుగులు , ఎత్తు 194 అడుగులు. ఇందులో మొత్తం 366 స్తంభాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 160,రెండవ అంతస్తులో 132, మూడో అంతస్తులో 70 నాలుగు స్తంభాలు, 27 నక్షత్ర వాటికలు ఉంటాయి. రాయి పైనే శిల్పాలు , ప్రతి స్తంభానికి 16 విగ్రహాలు చెక్కుతారు. హిందూ పురాణాల ప్రకారం దేవీ దేవతల విగ్రహాలను రూపొందిస్తారు. ముఖ్యంగా రామాలయానికి 5 ద్వారాలలో ప్రవేశం ఉంటుంది. మొదట సింహద్వారం గుండా ప్రధాన ప్రవేశం. ఐదు ప్రధాన విభాగాలు ఉన్నాయి. సింహ ద్వారం. నత్య మండపం.. రంగ మండపం.. ఆలయ ప్రధాన గోపురం.. గర్భగుడి. రామ మందిరానికి నాలుగు వైపులా నాలుగు చిన్న మందిరాలు నిర్మిస్తారు. మొదట గణేష్ ఆలయం, సీతా మాత ఆలయం, లక్ష్మణ్ ఆలయం, భరతుడి మందిరం ఉంటాయి. రామాలయానికి ఎదురుగా ఎత్తైన భారీ విజయస్థూపం ఏర్పాటు చేస్తారు. ఎడమవైపున నాలుగు వైపులా నాలుగు ద్వారాలతో కూడిన కథా వేదిక నిర్మాణం. ఈ కథా వేదికలో రామ కథ ..రామ లీల.. మహాభారతం.. పురాణ గాధలను చరిత్ర రూపంలో చూపిస్తారు. కథావేదిక పక్కన పరిశోధన కేంద్రం.. మరోవైపు భోజనశాల.. గ్రంథాలయం.. దేవాలయ సిబ్బంది కోసం వసతి గృహం ఉంటుంది. మందిరం చుట్టూ ఉన్న 67 ఎకరాల సువిశాల భూభాగంలో భారీ వృక్షాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థన మందిరం.. ఉపన్యాస వేదిక.. వేద పాఠశాల.. సంతు నివాస్.. యాత్ర నివాస్ మందిరాలు ప్రత్యేకంగా నిర్మిస్తారు.

క్యాతి గాంచిన డిజైనర్ తో ఆలయ నిర్మాణం

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శిల్పశాస్త్ర ప్రావీణ్యులు సోంపుర కుటుంబీకులతో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. చంద్రకాంత్ సోంపుర అనే శిల్ప శాస్త్ర ప్రముఖుడి ఆధ్వర్యంలో ఆలయం రూపుదిద్దుకుంటోంది. చంద్రకాంత్ సోంపుర కు సహాయకులుగా నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపురలు ఉన్నారు. గుజరాత్ లోని ప్రఖ్యాతి గాంచిన సోమనాథ్ మందిరం నిర్మాణ డిజైనర్లు కూడా సోంపురం కుటుంబీకులే కావడం విశేషం. చంద్రకాంత్ సోంపుర తాతగారైన ప్రభా శంకర్ సోంపు ర గారు సోమనాథ్ మందిరాన్ని రూపుదిద్దారు. శిల్ప శాస్త్రం లో 15 తరాలుగా ఈ కుటుంబానికి అనుభవం ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్ కు చెందిన ఈ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 131 మందిరాలకు అద్భుతంగా డిజైన్ చేశారు. లండన్ లోని స్వామి నారాయణ ఆలయంతో పాటు అమెరికాలోని చాలా దేవాలయాలు వారి చేతుల మీదుగా రూపొందించడం గొప్ప విషయం.

ప్రముఖ కంపెనీ చే నిర్మాణం

తరతరాలకు ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడి మందిర నిర్మాణాన్ని ప్రముఖ కంపెనీ అయిన ” larsen and toubro” ఎల్ అండ్ టి చేపట్టింది. దాదాపు 36 నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకున్నా తట్టుకునేలా దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా మన్నిక వచ్చేలా నిర్మాణం సాగుతోంది. రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపం సంభవించిన కూడా మందిరం చెక్కుచెదరదు. ఆలయంలో ఇంచు కూడా కదలదు. 200 అడుగుల లోతులో తవ్వి మట్టి నమూనాలు సేకరించి తదనుగుణంగా పనులు ప్రారంభించారు. చిన్న శిల్పం కూడా కదలకుండా నిర్మాణం ఉంటుంది. నిర్మాణంలో ఎటువంటి ఉక్కు, సిమెంట్, లోహం ఉపయోగించడం లేదు. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో లభించే ప్రత్యేకమైన రాయితో నిర్మాణం సాగుతోంది.

పగుడాకుల బాలస్వామి
ప్రచార సహ ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్, తెలంగాణ రాష్ట్రం
9912975753

(Visited 190 times, 1 visits today)
Author: kekanews