సానిటేషన్ టన్నెల్.. ఎలా పనిచేస్తుంది.. ఎంత ఖర్చవుతుంది..?

Sanitation Disinfectant Tunnel
Spread the love

కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు రకరకాలైన రక్షణ పద్ధతులను ప్రపంచం అనుసరిస్తోంది. ఇండియాలో.. ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న డాక్టర్లు, పోలీసులు.. వారి రక్షణ కోసం.. మార్కెట్ లాంటి ఏరియాల్లో జనం రక్షణ కోసం సానిటేషన్ టన్నెల్స్ ఏర్పాటుచేస్తున్నారు.

అసలీ సానిటేషన్ టన్నెల్ అంటే ఏంటి..

ఇది ఓ గుడారం లాగా ఉంటుంది. రెండు వైపులా ఓపెన్ ఉంటుంది. ఓవైపు నుంచి లోపలికి ప్రవేశించి.. మరోవైపునుంచి బయటకు రావొచ్చు. చుట్టూ.. పైపులతో.. సొల్యూషన్ స్ప్రింకిల్ అవుతుంది. లోపలికి వెళ్లిన మనిషిపై.. వర్షపు జల్లుపడినట్టుగా పడుతుంది. చేతులు పైకెత్తి..ఓరౌండ్ వేస్తే.. మనిషి ముఖం.. శరీరంపై దుస్తులు.. చేతులు.. కాళ్లు అన్నీ Disinfect అవుతాయి.

టన్నెల్ లో నీళ్లు ఎలా వస్తాయి….

సానిటేషన్ టన్నెల్ సాధారణంగా 3 నుంచి 4 ఫీట్ల వెడల్పు.. కనీసం 10 ఫీట్ల పొడవు ఉంటుంది. ఈ మొత్తం ఏరియాలో.. ఎడమ, కుడి, పై భాగాల్లో పైపుల ద్వారా నీళ్లు తుంపరలాగా వచ్చే ఏర్పాటు ఉంటుంది. ఈ పైపులను.. బయటి వైపున ఉండే ఓ ట్యాంక్ కు కనెక్ట్ చేస్తారు. బటన్ ఆన్ చేయగానే.. ఆ ట్యాంక్ నుంచి లిక్విడ్ స్ప్రే అవుతుంటుంది.

పైపుల ద్వారా వచ్చే లిక్విడ్ ఏంటి..

శరీరాలు, దుస్తులను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం వాడుతున్నారు. నీళ్లలో.. వన్ పర్సెంట్ సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం కలుపుతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రమాణాలను పాటించాలని అన్ని దేశాలకు సూచించింది.

ఈ టెక్నిక్ మనకెలా తెలిసింది..

డిస్ ఇన్ఫెక్ట్ బాక్స్.. శానిటైజ్ టన్నెల్ పేర్లతో.. ఈ ఏర్పాటును ముందు చైనా తయారుచేసింది. WHO సూచించిన పద్ధతిలో.. గత ఫిబ్రవరి నెలలో చాంగ్ కింగ్ అనే నగరంలో.. శానిటేషన్ టన్నెల్ ను ఏర్పాటుచేశారు. టన్నెల్ లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం మన ఒంటిపై పడినప్పుడు క్రిములు, వైరస్ లు నశిస్తున్నట్టు పరిశోధనలో తేలింది.

ఎంత ఖర్చు అవుతుంది..

సానిటేషన్ టన్నెల్ ను కనీసం రూ.90వేలు ఖర్చవవుతుందని అధికారులు చెప్పారు. దానికి అదనంగా హ్యాండ్ డ్రయ్యర్, బాడీ డ్రయ్యర్ లాంటి ఏర్పాట్లు చేస్తే.. ఆ ఖర్చు అదనం. గంట సేపు కంటిన్యూయస్ గా రన్ చేస్తే.. 50 లీటర్ల సొల్యూషన్ స్ప్రే అవుతుంది. రోజులో కనీసం 16 గంటల పాటు ఈ టన్నెల్ ను ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాడుకలో ఉంచుతున్నారు. మనుషులే కాకుండా.. బైక్ లు, కార్లు వెళ్లేలా ఏర్పాట్లు చేయొచ్చు. ఖర్చు ఒక్కసారి పెడితే.. కరోనా ఉన్నన్ని రోజులు వాడుకునే వెసులుబాటు ఉండటంతో.. ప్రభుత్వాలు.. వీటిని రద్దీ ఏరియాల్లో పెడుతున్నాయి.

(Visited 221 times, 1 visits today)
Author: kekanews