Bandi Sanjay : అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో బండి సంజయ్ బహిరంగ సభ

Bandi Sanjay : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తొలివిడత పాదయాత్రకు ఆసక్తికరమైన ముగింపు రాబోతోంది. ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా సరిహద్దుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ఎంటర్ కాబోతోంది. త్వరలోనే హుజూరాబాద్ సెగ్మెంట్ లోకి రావాల్సి ఉంది.

నరాలు తెంపేస్తున్న నభా నటేశ్.. Nabha Natesh Kasak Gallery

ఐతే… హుజూరాబాద్ పోలింగ్ అక్టోబర్ 30న జరుగుతుందని ప్రకటించిన ఎన్నికల సంఘం.. కఠిన నిబంధనలు అమలుచేస్తామని తెలిపింది. బహిరంగ సభల్లో 5వందల మంది కంటే ఎక్కువ మందిని పర్మిట్ చేసేది లేదని తెలిపింది. ప్రతిరోజూ బండి సంజయ్ వెంట.. వందలాది మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్ర కానీ.. బహిరంగ సభను కానీ ఈసీ అనుమతించే పరిస్థితులు కనిపించడం లేదు. తొలి విడత పాదయాత్రను హుజూరాబాద్ వరకు నిర్వహించి అక్కడే భారీ బహిరంగ సభ పెట్టాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించినా అది అమలుచేయలని పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో.. ఆల్టర్ నేట్ ప్లేస్ పై దృష్టిపెట్టింది బీజేపీ.

ShraddhaDas : ఎంత శ్రద్ధగా మెయిన్‌టెయిన్ చేస్తుందిరా బాబూ..!!

హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధిలో కాకుండా.. దాని సరిహద్దు ప్రాంతంలో పాదయాత్ర ముగించి భారీ బహిరంగ సభ పెట్టాలని బీజేపీ డిసైడైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే.. బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే పాదయాత్రను ముగించాలని నిర్ణయించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం.. పబ్లిక్ మీటింగ్ కు హుజూరాబాద్ కు దగ్గరున్న హుస్నాబాద్ పట్టణాన్ని ఎంపిక చేసింది. అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో బండి సంజయ్ భారీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి ప్లాన్ రెడీ చేసేశారు. కేడర్ కు, లీడర్లకు ఆదేశాలు ఇచ్చేశారు.

అందాల దేత్తడి ! అలేఖ్య సొగసు.. పొగలురేపే పులుసు

సిద్దిపేట జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ఎంటరై.. వింజపల్లి, కోహెడ, సముద్రాల, రేగొండ, పందిళ్ల మీదుగా హుస్నాబాద్ కు చేరుకుంటారు. అక్టోబర్ 2.. గాంధీ జయంతి రోజున హుస్నాబాద్ లో బహిరంగ సభ పెడతారు. హుస్నాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్. ఈయన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు. 2014 నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హైదరాబాద్, సిద్ధిపేట నుంచి హుజూరాబాద్ కు… హరీష్ రావు సహా ఇతర మంత్రుల రాకపోకలన్నీ.. హుస్నాబాద్ మీదుగానే కొనసాగుతుంటాయి. ఇపుడు హుస్నాబాద్ లో బీజేపీ సభతో.. పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మిగతా పార్టీలు కూడా.. బహిరంగ సభలను హుస్నాబాద్ లోనే ప్లాన్ చేసే చాన్సుంది.

(Visited 451 times, 1 visits today)
Author: kekanews