టిక్ టాక్ స్టార్, సూపర్ టాలెంటెడ్ బీటెక్ అమ్మాయి సోనికా కేతావత్ సడెన్ డెత్ ఆమె అభిమానులకు కోలుకోలేని విషాదంలోకి నెట్టింది. టిక్ టాక్ స్టార్స్ కలిసి ట్రిప్పులకు వెళ్లడం కామన్. అలాగే.. ఇటీవల సోనికాతోపాటు… తన ఫ్రెండ్ మరో టిక్ టాక్ స్టార్ రఫీ షేక్, కస్తూరి, అల్లు శ్రావ్జ్ మరికొందరు కలిసి గ్రూప్ గా బైక్ లపై వెళ్తుండగా.. నల్గొండ జిల్లా కేతపల్లి దగ్గర ప్రమాదం జరిగింది. కొర్రపాటి టోల్ గేట్ దగ్గర్లో జరిగిన ఈ ప్రమాదంలో రఫీ షేక్ తలకు గాయమైంది. అతడు చనిపోయే పరస్థితుల్లో ఉన్నాడనీ… ట్రీట్ మెంట్ కు లక్షలు ఖర్చవుతాయని చాలామంది ఫండ్ రైజింగ్ చేశారు. పదిరోజుల తర్వాత…. సీన్ మొత్తం మారిపోయింది.

ప్రమాదంలో వాస్తవానికి ఒకే బైక్ పై వెళ్తున్న ఇద్దరికి దెబ్బలు తగిలాయి. రఫీషేక్ వెనుక సీట్లో కూర్చుని సెల్ఫీ వీడియో తీస్తుండగా… సోనికా కేతవత్ ముందు కూర్చుని  బైక్ డ్రైవ్ చేసింది. అప్పుడే యాక్సిడెంట్ అయింది. ఐతే.. ప్రమాదంలో రఫీ కోమాలోకి వెళ్లిపోయాడు. సోనిక కాళ్లకు దెబ్బలు తగిలాయి. దీంతో.. అందరిచూపు రఫీ పై పడింది. రఫీ బతకాలంటూ ఆయన అభిమానులు ఫుల్లు వీడియోలుపెట్టారు. చికిత్స కోసం లక్షలు పోగుచేశారు. ఐతే.. తనకు డేంజర్ ఏమీ లేదని.. తాను ఇంటికి డిశ్చార్జ్ అయి వచ్చేశాననీ.. ఫండ్ రైజింగ్ ఆపాలని రఫీ షేక్ సోమవారం నాడు ఓ వీడియో పోస్ట్ లో టిక్ టాక్ లో అభిమానులను కోరాడు. ఈ వీడియో పెట్టిన ఒక్కరోజుకే ఎవ్వరూ ఊహించని రీతిలో సోనిక ప్రాణాలు కోల్పోయింది. ఆమె కాళ్లకు దెబ్బలు తగలి.. ఇన్ఫెక్షన్ అయిందని… బ్రెయిన్ డెడ్ కావడంతో.. ప్రాణాలు పోయినట్టుగా డాక్టర్లు డిసైడ్ చేశారు.

దీంతో తెలుగు టిక్ టాక్ సహా.. సోషల్ మీడియా దునియా మొత్తం.. ఒక్కసారిగా షాకయ్యింది. బాగా లేడన్న రవి బాగుపడటమేంటి.. నిన్నటివరకు గాయాలే ఐనట్టుగా చెప్పిన సోనిక చనిపోవడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. సోనిక ట్రీట్ మెంట్ గురించి ఆమె తల్లిదండ్రులే బయటకు చెప్పొదన్నాన్నారని కొందరు ప్రచారం చేశారు. ఐతే.. యాక్సిడెంట్ గురించి తమను మీడియా గానీ, ఇతరులు కానీ ..సంప్రదించలేదని కుటుంబసభ్యులు చెప్పారు.

సోనిక ఫ్రెండ్ రఫీ షేక్… హాస్పిటల్ నుంచి బయటకొచ్చాక.. ఓ వీడియో పోస్ట్ టిక్ టాక్ లో పెట్టినప్పుడు కనీసం.. సోనిక గురించి ఒక్కమాటైనా మాట్లాడాల్సింది కాదా  అని అడుగుతున్నారు.  టిక్ టాక్ అని సెల్ఫీ వీడియో పేరుతో…. బైక్ పై వెనుక కూర్చుని.. ముందు అమ్మాయిని కూర్చోబెట్టి చంపేశావ్ అంటూ రఫీ షేక్ పై మండిపడుతున్నారు నెట్ యూజర్స్. రఫీ షేక్ అభిమానులు.. అది యాక్సిడెంట్ అని.. అలా జరిగిపోయిందని అంటున్నారు.

 

(Visited 428 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *