బిగ్ బాస్ హౌజ్‌లో ఓ మెరుపు… శిల్పా చక్రవర్తి

బిగ్ బాస్ 3 సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఇలా వచ్చి.. అలా ఎలిమినేట్ అయిపోయింది. నామినేట్ అయినప్పుటే..ఆమె ఎగ్జిట్ ను అందరూ ఊహించారు. ఐతే… ఫస్ట్ టైమ్ నామినేట్ అయినవాళ్లే ఎలిమినేట్ అయిపోతున్నారన్న బిగ్ బాస్ 3 ఆనవాయితీ … శిల్పా ఎగ్జిట్ తో మరోసారి ప్రూవ్ అయింది. గత రెండు సీజన్లలో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినవారు గట్టి పోటీ ఇచ్చి… ఆ తర్వాత ఎగ్జిట్ అయ్యారు.

లాస్ట్ టైమ్ ఆలీ రెజా ఎగ్జిట్ అయినప్పుడు… హౌజ్ మేట్స్ కన్నీళ్లతో బిగ్ బాస్ హౌజ్ నిండిపోయినంత పనైంది. అంతగా బాధపడ్డారు. ఏడ్చారు. రోజుల తరబడి శివజ్యోతి, రవి ఏడ్చేసరికి సంతాప సభ పెడుతున్నామా అంటూ.. శ్రీముఖి పంచ్ లు వేసేంత వరకు వెళ్లింది. ఐతే.. ఈసారి మాత్రం శిల్పా చక్రవర్తి ఎలిమేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోతున్నప్పుడు అందరూ సరదాగా నవ్వుతూ సాగనంపారు.

వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున .. హౌజ్ మేట్స్ తో సరదా గేమ్స్ ఆడించాడు. నాగార్జున కోరడంతో ఒక్కొక్కరికీ ఒక్కో బిరుదు ఇచ్చింది శిల్పా చక్రవర్తి. బాబా భాస్కర్ కు జిత్తులమారి,  మహేష్ .. తిక్కలోడు… వరుణ్ కు కూల్ గాయ్ అని…  రాహుల్ కోపిష్టోడు అని.. శివజ్యోతి అలియాస్ సావిత్రిని ముద్దుగా అందమైన రాక్షసి అని..  పునర్నవి మూర్ఖురాలు అనీ… రవికృష్ణకు మొండోడు అని బిరుదులు ఇచ్చేసింది.

నిద్రపోయినప్పుడల్లా.. కుక్క మొరిగినప్పుడల్లా.. మహేష్ పూల్ లో దూకాలని బిగ్ బాంబ్ వేసి వెళ్లిపోయింది శిల్పా చక్రవర్తి. ఈ టాస్క్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిదన్నది ఆసక్తి కలిగిస్తోంది.

(Visited 93 times, 1 visits today)