పేదోడి ఇంటి వీడియోకు మిలియన్లలో వ్యూస్.. గ్రేట్ తమ్ముడు

Youtube Vlog Viral Video

యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలె.. లక్షల్లో వ్యూస్ కొట్టాలి.. సబ్ స్క్రైబర్లు పెంచుకోవాలి.. పైసల్ కమాయించాలె..

ఇదీ చాలామందికి ఓ కల.

ఏ వీడియో పెట్టాలె.. ఎట్ల తీయాలె.. అని ఆలోచించుకుంటూ ఏళ్లు గడిపేవాళ్లు ఎందరో.

వీడియో తియ్యకముందే… ట్రై పాడ్లు.. మైక్ లు.. స్టాండ్లు.. సెల్ఫీస్టిక్కులు కొనేవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు.

వీడియోలు తీయడం మొదలుపెట్టి.. మధ్యలో ఆపేసేవాళ్లు కూడా చాలామందే ఉంటారు.

కానీ.. మీరు ఇప్పుడు చూడబోయే వీడియో చాలా డిఫరెంట్.

కెమెరా షేకవుతూ ఉంటుంది. ట్రైపాడ్ ఉండదు. ఓ చిన్న పిల్లోడు తీస్తాడు. చాలా నేచురల్ గా ఉంటది.

మన దేశంలో ఓ పేదోడి నాలుగుగోడల మధ్య ఉండే జీవితం కనిపిస్తుంది. వారికి ఉండే కొండంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తోడపుట్టిన వారితో రక్తం పంచుకుని పుట్టినవారికి ఉండే బంధం విలువ చెప్పకనే ఈ వీడియో చెబుతుంది.

చదువు తక్కువైనా.. ఒక్క టాలెంట్ ఉంటే చాలు.. బతికేయొచ్చు అని ఈ వీడియో చెబుతుంది.

యూట్యూబ్ గ్రామర్ తెలియకపోయినా.. SEOలు రాయకపోయినా.. అదే టాలెంట్ నిలబెడుతుంది.

అందుకే.. ఈ పేదోడి ఇంటి వీడియోకు.. మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.

ఒక్క లైక్ కొట్టమని అడిగితే.. లక్షల్లో లైకులు ఇచ్చేశారు. వేలల్లో పాజిటివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు. తమ్ముడూ నీకు ఇదైనా ఉంది. మాకు ఆ ఇల్లు కూడా లేదు అని వేలమంది కామెంట్స్ పెడుతుంటే.. ఇది కదా మన దేశం అని అనిపిస్తుంది.

మా ఇల్లు ఇదే బయ్య ..చుసి నవ్వకండి my home tour

ఇదీ అతడు వీడియోకు పెట్టిన టైటిల్.

లేటెందుకు.. చూసేయండి ఆ వీడియో. ఇన్ స్పైర్ అవ్వండి.

(Visited 104 times, 1 visits today)