ఢిల్లీ అల్లర్లు: అందరికీ అమ్మ ఒక్కతే.. ఆగం కాకుర్రి

Spread the love

(CAA పై జాతీయ వాదులు కలం ఎత్తుతున్నారు. ఢిల్లీ అల్లర్లకు కారణాలు ఆలోచించండి అంటూ సూచిస్తున్నారు. సాకి కలం పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ కూడా చదవండి)

 

#కారకులెవ్వరు???

కారణం లేకుండా ఢిల్లీలో
కార్చిచ్చు రగిల్చిన కారకులెవ్వరు??
కారణం లేకుండా ఢిల్లీని
కదనరంగం చేసిన కారకులెవ్వరు??
కారణం లేకుండా
కల్లోలపడ్తున్న మెదడుల్ని
గాయాల పాలయిన గుండెల్ని
రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న మనుషుల్ని
చేసిందెవరు?? కారకులెవ్వరు??
కారణం లేకుండానే
అమాయకులు చస్తున్నరే!!
భావితరం ఆగమవుతున్నదే!!
మనుషులు కసాయిలు అవుతున్నరే!!
కారకులెవ్వరు??
పచ్చకళ్ళతో చూసే మూర్ఖుల్లారా??
పౌరసత్వ సవరణ చట్టం
పౌరులెవ్వరికి నష్టం లేదు…
పౌరులెవ్వరికి కష్టం కాదు…
అది ఇచ్చేదే కాని
తీసేసేది అసలే కాదు…..
కుహనా రాజకీయుల కుట్రల్లో
కుహనా మేతావుల కుతంత్రంలో
బలి అవుతున్న ముస్లిం సమాజమా??
మేధతో ఆలోచించండి
వివేకంతో వివేచించండి
విచక్షణతో తర్కించండి
అమ్మ ఒక్కతే మనకు ఆగం కాకుండ్రి
తల్లి ఒక్కతే మనకు తన్నుకు చావకుండ్రి
కారకులెవ్వరో దొరకపట్టుండ్రి
ఎవరు? ఇంకెవరు?
వారసత్వ కుర్చీ దూరమై
పదవీ నిరుద్యోగులయిన
కుహనా రాజకీయపార్టీలు….
మతరాజ్యమే లక్ష్యంగా
మంటలు రాజేసే జిహాదీ
మతతత్వ సిద్ధాంతాలు….
విదేశిసోమ్ములే విప్లవంగా
వర్గపోరు తమ మంత్రమైన
కంపు కమ్యూనికృష్టులు….
కారా కారకులు…??
వీరే కారకులు!!వీరే ప్రేరకులు!!
– #సాకి

(Visited 101 times, 1 visits today)
Author: kekanews