2004లో ప్రణబ్ ప్రధాని అయ్యుంటే.. ఆ కథే వేరుండేది..?

Pranab Mukherjee
కొందరికి పదవితోనే గౌరవం దక్కుతుంది.. కానీ కొందరితో ఆ పదవులకే గౌరవం పెరుగుతుంది.. ప్రణబ్ ముఖర్జీ-Pranab Mukherjee ఏ పదవి చేపట్టినా దాన్ని గౌరవ ప్రతిష్టలు మరింతగా పెంచారు. ప్రణబ్ దాదాకు ఏ పదవి దక్కినా ఆయన ప్రతిభ, అర్హతలే కారణం.. విచిత్రంగా అనే ఆయనకు అవరోధంగా మారాయి అనడం కఠిన సత్యం.
కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావుల తర్వాత దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అన్ని అర్హతలున్న నాయకుడు ప్రణబ్ ముఖర్జీయే. కానీ దీపం ముందు మిణుగురు పురుగురు లాంటి నాయకులు తమ మనుగడకు శత్రువు దాదాను ముప్పుగా భావించారు. వారసత్వ రాజకీయాలతో పబ్బం గుడుపుకునే నాయకులు ఇందిర తర్వాత ప్రధాని పదవికి ఎక్కడ పోటీకి వస్తాడో అని ఆయనపై కక్ష కట్టారు.
2004లో ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఉంటే దేశ చరిత్ర మరోలా ఉండేదేమో? ఇందిర తర్వాత ప్రధాని కావాలనుకున్నారు. దక్కలేదు.. పీవీ హయాంలో ఆర్థిక మంత్రి కావాలనుకున్నారు దక్కలేదు. అయినా ఏ పదవి ఇచ్చినా హుందాగా నిర్వహించారు. చివరకు దేశంలోనే అత్యంత పెద్ద పదవైన రాష్ట్రపతి పదవి హోదాలో రాజకీయాల నుంచి విరమించారు. భారతరత్నకు నిజమైన అర్హులు ఆయన.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో అరుదైన జాతీయవాద నాయకులు ఎవరైనా ఉంటే అది ప్రణబ్ దాదాయే.. ఈ కారణంగానే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. మహోన్నత శిఖరం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ మరచిపోలేం..

Kranthi Dev Mitra

(Visited 45 times, 1 visits today)