BREAKING.. రిపబ్లిక్ టీవీపై తిరగబడ్డ బాలీవుడ్… పరువునష్టం దావా

bollywood arnab goswamy

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగమైన బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై కథనాలను ఫుల్ లెంగ్త్ లో ప్రసారం చేసిన రిపబ్లిక్ టీవీపై బాలీవుడ్ తిరగబడింది.

బాలీవుడ్ కు చెందిన భారీ, అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్ లు, అసోసియేషన్ సంస్థలు ఢిల్లీ హైకోర్టులో లా సూట్ దాఖలు చేశాయి.

నాలుగు బాలీవుడ్ అసోసియేషన్ లు , 34 బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లు.. రిపబ్లిక్ టీవీపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాయి.

రిపబ్లిక్ టీవీ, ఆర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ టీవీలపై కేసులు పెట్టారు.

బాలీవుడ్ ను డీగ్రేడ్ చేశారనేది ప్రొడక్షన్ హౌజ్ లు చేస్తున్న ప్రధాన ఆరోపణ.

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీనే కాదు.. తమ వ్యక్తిత్వాలను కించపరిచేలా కథనాలు ప్రసారం చేశారని బడా ప్రొడ్యూసర్లు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు.

కేసులు వేసిన వారిలో.. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్, సల్మాన్ ఖాన్ వెంచర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఉన్నాయి.

(Visited 49 times, 1 visits today)