అక్షరాల సిరివెన్నెల.. తాతలోని మనవడిని అక్షరాల్లో చూపించాడు..!

Prati Roju Pandage
Spread the love

ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు సిద్ధం కావడంతో.. ఆ మూవీలోని మరో లిరికల్ పాటను విడుదల చేశారు మేకర్స్. సాయితేజ్ – రాశీఖన్నా కాంబినేషన్ లో మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన చిన్నతనమనే.. పాటను విడుదల చేశారు. ఆ పాటలోని రచన తాతలోని తండ్రిని.. తండ్రిలోని కొడుకును… మనవడిలో తన చిన్ననాటి జ్ఞాపకాలు చూసుకునే తాతను గురించి వివరించాడు. తమన్ మెలోడీ ట్యూన్ లో సిరివెన్నెల సాహిత్యం.. మనసును తాకేలా ఉంది.

ఓసారి ఆ సాహిత్యం మీరూ చూడండి. తర్వాత పాట వింటూ చూడండి.

“తాతగా తల పండినా..

తండ్రి తనమే ఎండునా..

ఒడిని వీడి కొడుకుకెదిగినూ

నాన్న మురిపెం తీరునా

వయసు వాలిన సందె వాలున చేతికందిన ప్రియవరం

మనవడై తన పసితనమ్మును వెంట తెచ్చిన సంబరం

కొత్త ఊపిరి కాగా.. మనసు ఊయలలూగా..

తరతరమ్ముల పాటు ఇంకని వంశధారగ మారు కడలిని కలియని జీవనదిగా పారుతుంది కదా

కంచికి చేరుకథగా ముగిసిపోదు కదా..”

ఇది కూడా చదవండి : లోకేశ్ ఏశాడుగా..! తాను పప్పు ఐతే.. జగన్ గన్నేరు పప్పంట 

ఇది కూడా చదవండి : బెంగళూరులో హీరో.. ఆటో డ్రైవర్ కు రూ.10వేల ప్రైజ్

(Visited 143 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *