లోకేశ్ ఏశాడుగా..! తాను పప్పు ఐతే.. జగన్ గన్నేరు పప్పంట

Nara Lokesh Pappu YS Jagan Ganneru Pappu
Spread the love

నారాలోకేశ్ ఇవాళ “పెంద్లకాడే(పొద్దున్నే అన్నట్టు)” అందరినీ లేపాడు. కొన్ని వీడియోలూ చూపించాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో అసలు విషయం మాట్లాడాడు.

అదేంటంటే..

తనను వైసీపీ సభ్యులంతా పప్పు… పప్పు అని అసెంబ్లీలో తిట్టడానికి కౌంటర్ అన్నమాట. సభలో లేని నామీద పడ్డారెందుకయ్యా అని గయ్యిమన్నాడు లోకేశ్. తన నాలుకమందం, మాటల పొరపాట్లను కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అసలైన పంచ్ వేశాడు. ఇన్ని తప్పులు మాట్లాడిన తాను పప్పు అయితే…  జగన్ మాటల్లో పొరపాట్లను బట్టి… ఆయన గన్నేరు పప్పు అని పేరు పెట్టేశాడు.

టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం బైక్ దిగిన డాక్టర్..  అని జగన్ చెప్పిన మాట పొరపాటును వీడియోగా ప్లే చేశాడు. ఇదిప్పటికే ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ అనుకోండి. జగన్ ప్రసంగాల్లో.. తడబాటు ఉన్న పలు వీడియోలను ఈ సందర్భంగా లోకేశ్ ప్లే చేశాడు. ఇంతకీ.. మాట పొరపాటు ఒక్కటేనా  లోకేశ్ కు పప్పు అని పేరుతెచ్చింది. ఈ విషయం వైసీపీ, టీడీపీ వాళ్లకే ఎక్కువ తెలుసు.

ఇది కూడా చదవండి : ఇదేం స్టైలురో రాములా.. బాటిల్ ఫైట్.. కొడవలే లైటర్

 

(Visited 546 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *