Posted inMain Stories / పొలి కేక / ఫ్రెష్ కేక

Delhi Assembly Elections : టైమ్ చూసి దెబ్బ కొట్టారు కదరా..కేజ్రీవాల్‌కు బిగ్ షాక్‌

Delhi Assembly Elections

Delhi Assembly Elections :  మరో ఐదో రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 7 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కట్ చేసింది.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో త్రిలోక్‌పురి నుండి రోహిత్ మెహ్రౌలియా, జనక్‌పురి నుండి రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ నుండి మదన్‌లాల్, పాలెం స్థానం నుండి భావన గౌర్, బిజ్వాసన్ నుండి బిఎస్ జూన్, ఆదర్శ్ నగర్ నుండి పవన్ శర్మ , మెహ్రౌలీ నుండి నరేష్ యాదవ్ ఉన్నారు.

కేజ్రీవాల్‌పైనా, ఆప్‌ పైన విశ్వాసం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపిన లేఖలో తెలిపారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న ఒకే దశలో జరగనున్నాయి. ఫిబ్రవరి 8న కౌంటింగ్‌ జరగనుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిపత్యం చెలాయించింది, మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది.

దాదాపు మూడు దశాబ్దాలుగా దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ , గత రెండు ఎన్నికల్లో కేవలం 3, 8 సీట్లు గెలుచుకుని తిరిగి పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఢిల్లీని 15 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Rashmika Samantha Pushpa Item Song Regina
Rashmika Samantha Pushpa Item Song Regina